Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-196bd315-068c-4da8-a7bb-3d1235dc4fec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/election-196bd315-068c-4da8-a7bb-3d1235dc4fec-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీలను కలుపుకొని కూటమిగా ముందుకు సాగుతున్నాయి. కాగా కేంద్రంలో INDIA కూటమి గెలుస్తుందా.. ఎన్డీఏ కుంటకు తెలుస్తుందా అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారూ. అయితే ఎన్నికలు వస్తే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునేందుకుElection {#}vishwa;India;Yevaru;Elections;Parliment;Bharatiya Janata Partyఓటర్ల తెలివి ముందు.. అభ్యర్థులే ఓడిపోతారా?ఓటర్ల తెలివి ముందు.. అభ్యర్థులే ఓడిపోతారా?Election {#}vishwa;India;Yevaru;Elections;Parliment;Bharatiya Janata PartyTue, 02 Apr 2024 18:15:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా  మోగింది. ఎక్కడ చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీలను కలుపుకొని కూటమిగా ముందుకు సాగుతున్నాయి. కాగా కేంద్రంలో india కూటమి గెలుస్తుందా.. ఎన్డీఏ కుంటకు తెలుస్తుందా అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారూ.


 అయితే ఎన్నికలు వస్తే హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అభ్యర్థులు. కొంతమంది ఏకంగా డబ్బులు పంచడం చేస్తే.. ఇంకొంతమంది మద్యం ఏరులై పారిస్తూ ఉంటారు. మరి కొంతమంది విలువైన కానుకలు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అయితే అభ్యర్థులు ఇలా ఓటర్లను అకట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్ డెసిషన్ మాత్రం ఓటర్లదే.


 అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృశ్య ఓటర్ల తెలివి ముందు అభ్యర్థులే ఓడిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు బాగా తెలివిగా ఆలోచిస్తున్నారు. మా పార్టీవాళ్ళే మనకు కాకపోతే ఇంకెవరికి ఓటు వేస్తారు అనుకునే పరిస్థితి అస్సలు లేదు. ఒకప్పటిలా డబ్బు మందు పంచిన వాళ్ళకి కాదు అభివృద్ధి చేసేటోడికి.. మా కోసం నిలబడతాడు అనే నమ్మకాన్ని ఇచ్చిన వారికే ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఊహకందని రీతిలో ఓటర్ల వ్యూహాలు ఉంటున్నాయి అని చెప్పాలి. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న కేంద్రంలో మాత్రం బిజెపి ఉండాలని కొంతమంది.. రాష్ట్రంలో ఉన్న పార్టీకి చెందిన అభ్యర్థులని పార్లమెంట్ ఎలక్షన్లలో గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని మరి కొంతమంది అనుకుంటున్నారు.


 పార్టీకి కట్టుబడి ఎవరు నిలబడిన ఓటు వేయాలని కొంతమంది అనుకుంటే.. పార్టీతో పని లేకుండా అభివృద్ధి చేస్తాడు అనుకున్న అభ్యర్థికే ఓటు వేయాలని మరి కొంతమంది ఓటర్లు అనుకుంటున్నారట. ఇలా పార్టీలు, అభ్యర్థుల ఊహకందని రీతిలో ఓటర్లు తెలివిగా ఆలోచిస్తున్నారు. అందుకే ఓటర్ల వ్యూహం ముందు అభ్యర్థులే ఓడిపోతారు అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>