EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0b3a6c04-a123-4754-8629-7cef3f9d95c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0b3a6c04-a123-4754-8629-7cef3f9d95c5-415x250-IndiaHerald.jpgనాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం భయపడకపోవడం. ఎవరో ఏదో అన్నారని.. ఏదో అనుకుంటారని తన నిర్ణయాలను మార్చుకోకూడదు. ఏదైనా తాను చేయగలనన్న మొండి ధైర్యం ఉన్నవాడే రాజకీయాల్లో అసలు, సిసలు నాయకుడిగా ఎదుగుతారు. ఈ లక్షణాలన్నీ ఏపీ సీఎం జగన్ లో పుష్కలంగా కనిపిస్తాయి. జగన్ మొదటి నుంచి మాట తప్పను.. మడిమ తిప్పను అనే విధానంతోనే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ఒక్కరే ఒకవైపు. మిగతా రాజకీయ పార్టీలన్నీ మరోవైపు. అయినా ఏ మాత్రం సడలకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంతమంది శత్రువులు jagan{#}CBN;Jagan;Andhra Pradesh;CBI;YCP;Yevaru;Assembly;Congress;CM;Marchజగన్‌: గెలిచినా.. ఓడినా.. ఒక్కడే కారణం?జగన్‌: గెలిచినా.. ఓడినా.. ఒక్కడే కారణం?jagan{#}CBN;Jagan;Andhra Pradesh;CBI;YCP;Yevaru;Assembly;Congress;CM;MarchTue, 02 Apr 2024 11:00:00 GMTనాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం భయపడకపోవడం. ఎవరో ఏదో అన్నారని.. ఏదో అనుకుంటారని తన నిర్ణయాలను మార్చుకోకూడదు. ఏదైనా తాను చేయగలనన్న మొండి ధైర్యం ఉన్నవాడే రాజకీయాల్లో అసలు, సిసలు నాయకుడిగా ఎదుగుతారు. ఈ లక్షణాలన్నీ ఏపీ సీఎం జగన్ లో పుష్కలంగా కనిపిస్తాయి. జగన్ మొదటి నుంచి మాట తప్పను.. మడిమ తిప్పను అనే విధానంతోనే ప్రజల వద్దకు వెళ్తున్నారు.  


ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ఒక్కరే ఒకవైపు. మిగతా రాజకీయ పార్టీలన్నీ మరోవైపు. అయినా ఏ మాత్రం సడలకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఇంతమంది శత్రువులు గుంపుగా వస్తున్నా తాను మాత్రం సింగిల్ గానే వస్తా అంటున్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ రావడం మామూలు విషయం కాదు. ఇది రాజకీయ నేతలందరికీ తెలుసు.


కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఆయనకు సీబీఐ నోటీసులు, అరెస్టులు, జైలు జీవితం ఇవన్నీ గడిపారు. వీటన్నింటిని తట్టుకొని 2014 ఎన్నికల్లో ఒంటరిగానే అన్ని స్థానాల్లో బరిలో  నిలిచారు. ఆ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీని అణగదొక్కాలని చూసినా.. మొండిగా ఎదుర్కొని 2019లో మళ్లీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను దింపి ఏకపక్ష విజయం సాధించారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఓటమికే మూడు పార్టీలతో కలిసి వస్తున్నారు.


ఈ సారి ఎన్నికల్లో కూడా నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పి ఓటు అడిగే సాహసం ఎవరు చేస్తారు ఒక్క జగన్ తప్ప. పైగా సగానికి పైగా అభ్యర్థులను మార్చి సోషల్ ఇంజినీరింగ్ పేరుతో తన ప్రధాన అనుచరులకు సైతం టికెట్లు నిరాకరించి బీసీలకు పెద్ద పీట వేశారు. అక్కడ అభ్యర్థులను కాదు.. తనను చూసి ఓటేస్తారే అని ధీమా సీఎం జగన్ ది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఈ ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా అది జగన్ పై ఆధారపడే జరుగుతుంది తప్ప ఇతర నాయకుల వల్ల కాదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>