PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uttarandhra-will-jagan-break-the-stronghold-of-tdp-will-he-raise-his-handc7f0657a-a925-44b8-8aba-3e26fc87810c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uttarandhra-will-jagan-break-the-stronghold-of-tdp-will-he-raise-his-handc7f0657a-a925-44b8-8aba-3e26fc87810c-415x250-IndiaHerald.jpgఉత్త‌రాంధ్ర‌లో ఏపీకి చివ‌ర‌న ఒడిసా బోర్డ‌ర్‌లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం ఇచ్ఛాపురం. ఇది తెలుగుదేశం కంచుకోట…ఇచ్ఛాపురం నియోజకవర్గం. టీడీపీ ఏర్పాటు తర్వాత ఒకే ఒక్క ఎన్నికలో ఓడిపోయింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు జ‌గ‌న్ ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట నాలుగు మండలాలు ఉన్నాయి. ఉద్దానం అని కిడ్నీ బాధితుల ఆర్త‌నాదాల‌తో మార్మోగే ప్రాంతంలో ఇది ఒక భాగం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వ‌రుస విజ‌యాలు సాధించAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; Uttarandhra{#}allari naresh;Cycle;MLA;ashok;Congress;Telugu Desam Party;Hanu Raghavapudi;YCP;Party;TDPఉత్త‌రాంధ్ర‌: టీడీపీ కంచుకోట‌ను జ‌గ‌న్ బ‌ద్ద‌లు కొట్టిస్తాడా.. చేతులెత్తేస్తాడా..?ఉత్త‌రాంధ్ర‌: టీడీపీ కంచుకోట‌ను జ‌గ‌న్ బ‌ద్ద‌లు కొట్టిస్తాడా.. చేతులెత్తేస్తాడా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; Uttarandhra{#}allari naresh;Cycle;MLA;ashok;Congress;Telugu Desam Party;Hanu Raghavapudi;YCP;Party;TDPTue, 02 Apr 2024 10:29:38 GMTఉత్త‌రాంధ్ర‌లో ఏపీకి చివ‌ర‌న ఒడిసా బోర్డ‌ర్‌లో ఉండే నియోజ‌క‌వ‌ర్గం ఇచ్ఛాపురం. ఇది తెలుగుదేశం కంచుకోట…ఇచ్ఛాపురం నియోజకవర్గం. టీడీపీ ఏర్పాటు తర్వాత ఒకే ఒక్క ఎన్నికలో ఓడిపోయింది. టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు జ‌గ‌న్ ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట నాలుగు మండలాలు ఉన్నాయి. ఉద్దానం అని కిడ్నీ బాధితుల ఆర్త‌నాదాల‌తో మార్మోగే ప్రాంతంలో ఇది ఒక భాగం. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ వ‌రుస విజ‌యాలు సాధించారు.

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్క‌డ‌ 7 సార్లు టీడీపీ విజయం సాధించింది. 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మ‌ళ్లీ గెల‌వ‌డానికి ఏ పార్టీ చేసిన ప్ర‌య‌త్నం కూడా ఫ‌లించ‌లేదు. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అశోక్ టీడీపీ అభ్య‌ర్థి కాగా.. వైసీపీ నుంచి పిరియా విజ‌య‌కు జ‌గ‌న్ సీటు ఇచ్చారు. ఆమె మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య‌.. జ‌డ్పీచైర్మ‌న్‌. సాయిరాజ్ ఇక్క‌డే 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజ‌క‌వ‌ర్గంలో కులాల ప‌రంగా చూస్తే రెడ్డిక, యాదవ, మత్సకార సామాజిక వర్గాల ఓట‌ర్లు అధికం. ఆ త‌ర్వాత కళింగ, బెంతు ఒడియా, శ్రీశయన సామాజిక వర్గాలు ఉన్నాయి.

సాయిరాజ్ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వ‌డంతో వైసీపీలో అసంతృప్తి ఉంది. ఈ సారి రెడ్డిక కులం త‌మ‌కు సీటు ఇవ్వాల‌ని అడిగినా ప‌ట్టించుకోక‌పోవ‌డం వైసీపీలో మైన‌స్‌గా ఉంది. నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో నర్తు రామారావు, నరేశ్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర, పిరియా సాయిరాజ్ ఎవరికి వారే యమునాతీరే అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్‌ రద్దు, ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు ప్ర‌ధాన అంశాలు. రెండో కోన‌సీమ‌గా ఉద్దానంలో కొబ్బ‌రి రైతుల‌ను ఆదుకుంటామ‌ని చెపుతున్నా ప‌ట్టించుకునే వాళ్లే లేరు.

వైసీపీలో ఉన్న గ్రూపులు గోల బెందాళం అశోక్‌కు కలిసి రానుంది. ఇక్క‌డ జ‌న‌సేన‌కు నిక్క‌చ్చిగా ఉన్న 15 వేల ఓటు బ్యాంకు టీడీపీకి ప్ల‌స్ కాగా... సామాజికవర్గాలకు అతీతంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీని లైక్ చేస్తుంటారు. ఇక్క‌డ అభ్య‌ర్థి ఎవ‌రు అన్న‌ది వాళ్ల‌కు అన‌వ‌స‌రం.. సైకిల్ గుర్తు చూసి మ‌రీ ఓటు గుద్దుతారు.  అలా అని టీడీపీ క్యాండెట్ నిర్ల‌క్ష్యంతో ఉంటే సీన్ రివ‌ర్స్ అయినా అవ్వొచ్చు. కుల స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా విజ‌య‌కు కాస్త ప్ల‌స్ ఉంది.

జ‌గ‌న్ ఈ సారి ఎలాగైనా ఇచ్ఛాపురాన్ని కొట్టాల‌ని చాలా ఈక్వేష‌న్లు పాటించాడు. ఇక్క‌డ వైసీపీ క్యాండెట్ విజ‌య గెలుపును మూడు సామాజిక వర్గాలు నిర్ణ‌యించ‌నున్నాయి. అందుకే ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి కళింగులను, నర్తు రామారావుకు ఎమ్మెల్సీ ఇచ్చి యాదవులను, ఇతర నామినేటెడ్ పదవులు ఇచ్చి రెడ్డిక వర్గాలను జ‌గ‌న్ మ‌చ్చిక చేసుకునేలా ప్లాన్ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>