EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy8b68f039-b024-4439-ad19-4e3d424b865d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy8b68f039-b024-4439-ad19-4e3d424b865d-415x250-IndiaHerald.jpgసాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్నెళ్ల పాటు రాజకీయ వాతావరణం స్తబ్ధుగా ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారింది. రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పట్టుమని పది రోజులు కూడా ప్రశాంతంగా పాలన చేసింది లేదు. నిత్యం ఏదో ఒక చిక్కుముడి.. ఆరోపణలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బెదిరింపులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే కడియం శ్రీహరితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు త్వరలో మా ప్రభుత్వమే రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. అప్పటిrevanth reddy{#}Komati;Tammudu;Thammudu;Chitram;Revanth Reddy;revanth;Reddy;Telangana;Assembly;central government;MP;Government;Congress;Party;Bharatiya Janata Party;CM;Minister;Cinemaతెలంగాణ షాకింగ్‌: రేవంత్‌ రెడ్డి కుర్చీ.. కిషన్‌ రెడ్డి లాగేస్తారా?తెలంగాణ షాకింగ్‌: రేవంత్‌ రెడ్డి కుర్చీ.. కిషన్‌ రెడ్డి లాగేస్తారా?revanth reddy{#}Komati;Tammudu;Thammudu;Chitram;Revanth Reddy;revanth;Reddy;Telangana;Assembly;central government;MP;Government;Congress;Party;Bharatiya Janata Party;CM;Minister;CinemaTue, 02 Apr 2024 08:00:00 GMTసాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్నెళ్ల పాటు రాజకీయ వాతావరణం స్తబ్ధుగా ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారింది. రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పట్టుమని పది రోజులు కూడా ప్రశాంతంగా పాలన చేసింది లేదు. నిత్యం ఏదో ఒక చిక్కుముడి.. ఆరోపణలు.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బెదిరింపులు.


కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే కడియం శ్రీహరితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు త్వరలో మా ప్రభుత్వమే రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు సీఎం తెరతీశారు. ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలను పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీకి చెందిన శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి  సంచలన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.


బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే  48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కోమటి రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత తమ్ముడు  రాజగోపాల్ రెడ్డి భార్యకే ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తెలంగాణలో మరో ఏక్ నాథ్ షిండే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి గడ్కరీ ముందు ఒప్పుకున్నారని తెలిపారు. బీజేపీని టచ్ చేస్తే 60మందిని 48 గంటల్లో లాగేస్తామని హెచ్చరించారు.


అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఇలా చేస్తే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఉద్దవ్ ఠాక్రేని మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. కానీ బీజేపీ దీనిని గొప్పగా చెప్పుకుంటోంది అని విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ తరహా వ్యాఖ్యల వల్ల రేవంత్ కు ఊతం అందించినట్లే..  మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారు అందుకే చేర్చుకుంటున్నాం అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది.  ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనే వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. వీటివల్ల లాభం చేకూరపోగా.. నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>