MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ సమ్మర్ సీజన్ కు ప్రభాస్ ‘కల్కి’ తప్ప మరే టాప్ హీరో సినిమాల విడుదల లేకపోవడంతో ఈ సమ్మర్ సీజన్ ను ‘కల్కి’ మ్యానియా షేక్ చేస్తుందని అంతా భావించారు. దీనికితోడు వైజయంతీ మూవీస్ కు బాగా కలిసి వచ్చే మే 9 రిలీజ్ కావడంతో ఈమూవీకి అన్ని విధాలా పరిస్థితులు సహకరిస్తున్నాయి అన్న అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మే 13న ఎన్నికల తేదీ కావడంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజల దృష్టి అంతా ఎన్నికల పై ఉంటుంది కాబట్టి అలాంటి ఎలక్షన్ ఫీవర్ మధ్య ‘కల్కి’ మూవీని విడుదల చేయవద్దు అంటూ ఈమూవీ బయ్యర్లు ఈమూవీని నిర్మిస్తున్న నిర్మాతల పై prabhas{#}June;Kshanam;Darsakudu;Vyjayanthi Movies;Prabhas;Hero;Director;Telugu;News;Indiaకల్కి 2898 దారి ఎటు ?కల్కి 2898 దారి ఎటు ?prabhas{#}June;Kshanam;Darsakudu;Vyjayanthi Movies;Prabhas;Hero;Director;Telugu;News;IndiaMon, 01 Apr 2024 09:00:00 GMTఈ సమ్మర్ సీజన్ కు ప్రభాస్ ‘కల్కి’ తప్ప మరే టాప్ హీరో సినిమాల విడుదల లేకపోవడంతో ఈ సమ్మర్ సీజన్ ను ‘కల్కి’ మ్యానియా షేక్ చేస్తుందని అంతా భావించారు. దీనికితోడు వైజయంతీ మూవీస్ కు బాగా కలిసి వచ్చే మే 9 రిలీజ్ కావడంతో ఈమూవీకి అన్ని విధాలా పరిస్థితులు సహకరిస్తున్నాయి అన్న అంచనాలు ఏర్పడ్డాయి.


అయితే మే 13న ఎన్నికల తేదీ కావడంతో తెలుగు రాష్ట్రాలలోని ప్రజల దృష్టి అంతా ఎన్నికల పై ఉంటుంది కాబట్టి అలాంటి ఎలక్షన్ ఫీవర్ మధ్య ‘కల్కి’ మూవీని విడుదల చేయవద్దు అంటూ ఈమూవీ బయ్యర్లు ఈమూవీని నిర్మిస్తున్న నిర్మాతల పై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన వర్క్ లోని ఒక కీలక భాగం షూటింగ్ పెండింగ్ లో ఉంది అని అంటున్నారు.


ఈమూవీలో పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయాలి అంటే దర్శకుడు నాగ్ అశ్విన్ ఏప్రియల్ నెల అంతా క్షణం తీరిక లేకుండా పరుగులు తీయవలసి వస్తుంది. దీనికితోడు ఈమూవీ శాటిలైట్ రైట్స్ అదేవిధంగా డిజిటల్ రైట్స్ బిజినెస్ ఇంకా పూర్తికాలేదు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో రాబోతున్న ఎన్నికల వంక పెట్టి ఈమూవీని మరో రెండు మూడు వారాలు వాయిదా వేసి మే నెలాఖరున కానీ లేదంటే జూన్ మొదటివారంలో కానీ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై ఇప్పుడు ఈమూవీ నిర్మాతల మధ్య చాల సీరియస్ గా చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు.


దీనితో ‘కల్కి’ విడుదల వాయిదా పడటం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో మరో కొత్త రిలీజ్ డేట్ ను ఆలోచించి విడుదల చేయడం చాల కష్టం అనీ ఈమూవీ వాయిదా పడితే ఇప్పట్లో ఈసినిమా విడుదలకు సరైన రిలీజ్ డేట్ దొరకడం కష్టం అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>