PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections81c67a6d-2c2c-4cb4-895b-ddfbfe5795db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections81c67a6d-2c2c-4cb4-895b-ddfbfe5795db-415x250-IndiaHerald.jpgపల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో విడదల రజని గెలిచి వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు. పేటలో ఏరియా ఆసుపత్రిని డెవలప్ చేసి అసలు దాని గురించి పట్టించుకోవటంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.దాంట్లో భాగంగా అక్కడ చాలా పరికరాలున్నా కూడా ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉన్నాయి మరియు మందులు కూడా తగినన్ని లేవని తెలుస్తుంది.ఇంకా వైద్యులు విషయానికి వస్తే అక్కడ వాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు అని ప్రజలు వాపోతున్నారు.చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రం, మున్సిపాల్టీలో ఒక ఏరియా ఆస్పత్రి, assembly elections{#}RAJINI VIDADALA;Chilakaluripeta;Evening;YCP;Minister;Hanu Raghavapudiపల్నాడు : పేరుకే మంత్రి.. సేవలకు దూరం అంటున్న 'పేట' ప్రజానీకం....!!పల్నాడు : పేరుకే మంత్రి.. సేవలకు దూరం అంటున్న 'పేట' ప్రజానీకం....!!assembly elections{#}RAJINI VIDADALA;Chilakaluripeta;Evening;YCP;Minister;Hanu RaghavapudiMon, 01 Apr 2024 12:54:52 GMTపల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో విడదల రజని గెలిచి వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు. పేటలో ఏరియా ఆసుపత్రిని డెవలప్ చేసి అసలు దాని గురించి పట్టించుకోవటంలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.దాంట్లో భాగంగా అక్కడ చాలా పరికరాలున్నా కూడా ప్రస్తుతం పనిచేయని స్థితిలో ఉన్నాయి మరియు మందులు కూడా తగినన్ని లేవని తెలుస్తుంది.ఇంకా వైద్యులు విషయానికి వస్తే అక్కడ వాళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు అని ప్రజలు వాపోతున్నారు.చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రం, మున్సిపాల్టీలో ఒక ఏరియా ఆస్పత్రి, ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. అలాగే మండలంలోని కావూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది. ఈ ఆస్పత్రులకు ఎక్స్‌రే, రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణకు సంబంధించిన వైద్యపరికరాలు ఇచ్చారు కానీ అవి సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా మంది బయట ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్ళవలసి వస్తుంది.దాంతో పేదలకు ఆర్థిక భారం తప్పడం లేదని తెలుస్తుంది.

అలాగే రాత్రిపూట కూడా సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. జనరల్ గా అయితే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి మరియు ఆ తర్వాత కూడా 9 గంటల వరకూ ఫోన్‌లో అందుబాటులో ఉండాలి. అవసరమైతే ఏ సమయంలోనైనా ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. వంద పడకలున్న ఏరియా ఆస్పత్రిలో రాత్రి వేళల్లో ఒక నర్సు, వైద్యులు విధుల్లో ఉండాలనే కనీస నిబంధనా కూడా అమలు కావడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. దాని వల్ల చాలామంది సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రైవేటు ఆస్పత్రులను పోవాల్సి వస్తుంది.గర్భిణులకు రాత్రివేళల్లో పురిటి నొప్పులు వస్తే ప్రైవేటు ఆస్పత్రుల వైపు మాత్రమే చూడాల్సి వస్తుంది.ఇంకోవైపు ఆస్పత్రులకు సరైన రక్షణ వ్యవస్థ కూడా లేదు అగ్ని మాపక పరికరాలు సరిగా పని చేయడం లేదు.అలాగే సిసి కెమెరాలు ఉన్నా కూడా అవి పని చేయడం లేదు. అయితే దాని గూర్చి వీటి కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేదని అక్కడ సిబ్బంది వాపోతున్నారు.ఆస్పత్రులకు వాచ్‌మెన్‌ల పోస్టులు మంజూరైనా కూడా కనీసం వారినీ నియమించలేదు.ఇలాంటి వంద పడకల ఆస్పత్రికి ముగ్గురు వాచ్‌మెన్లను నియమించాల్సి ఉన్నా అదీకూడా చేయలేదు లేదు.

అయితే తమ ఓట్లతో గెలిచి మంత్రి పదవి చేపట్టిన విడదల రజని మీద అక్కడి ప్రజానీకం తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు. ఆమెను గత ఎన్నికల్లో గెలిపించుకుంటే అసలు తమ గూర్చి పట్టించుకోలేదని ఈసారి ఆమెను కచ్చితంగా ఓటమి పాలుచ్చేద్దాం అని అనుకున్నట్లు గా తెలిసింది. దీన్ని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఆమెను స్థానచలనం చేయడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>