PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayasima-tdp-chandbashae8566b5c-5f19-4ad2-b0dc-3db4acb942d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayasima-tdp-chandbashae8566b5c-5f19-4ad2-b0dc-3db4acb942d0-415x250-IndiaHerald.jpgకదిరి నియోజకవర్గం లో టిడిపి పార్టీకి మరో షాక్ తగిలింది.. అక్కడ కీలకమైన నేత కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా టిడిపికి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న కథనం ప్రకారం.. కదిరిలోని మైనార్టీలకు అవమానాల తప్ప అధికారాలు లేవంటూ ఆరోపిస్తూ తనకు మంత్రి పదవి ఇస్తానంటు చంద్రబాబు మాట తప్పారని దీంతో చంద్రబాబుతో కలిసి పని చేయలేనని కూడా తెలియజేశారు.. కదిరిలో ముస్లిమ్స్ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తనకు కదిరిలో టికెట్ ఇవ్వలేదని చాంద్ బాషా వెల్లడించారు. అంతేకాకుండా కదిరిRAYASIMA;TDP;CHANDBASHA{#}Minister;Evening;Kadiri;Kathanam;District;MLA;Reddy;Indian;రాజీనామా;CM;News;CBN;Hanu Raghavapudi;YCP;TDP;Partyరాయలసీమ: టిడిపికి మరో షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!!రాయలసీమ: టిడిపికి మరో షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!!RAYASIMA;TDP;CHANDBASHA{#}Minister;Evening;Kadiri;Kathanam;District;MLA;Reddy;Indian;రాజీనామా;CM;News;CBN;Hanu Raghavapudi;YCP;TDP;PartyMon, 01 Apr 2024 07:30:00 GMTకదిరి నియోజకవర్గం లో టిడిపి పార్టీకి మరో షాక్ తగిలింది.. అక్కడ కీలకమైన నేత కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ భాషా టిడిపికి గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది.. ఇండియన్ హెరాల్డ్ కు అందిస్తోన్న కథనం ప్రకారం.. కదిరిలోని మైనార్టీలకు అవమానాల తప్ప అధికారాలు లేవంటూ ఆరోపిస్తూ తనకు మంత్రి పదవి ఇస్తానంటు చంద్రబాబు మాట తప్పారని దీంతో చంద్రబాబుతో కలిసి పని చేయలేనని కూడా తెలియజేశారు.. కదిరిలో ముస్లిమ్స్ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తనకు కదిరిలో టికెట్ ఇవ్వలేదని చాంద్ బాషా వెల్లడించారు.



అంతేకాకుండా కదిరిలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు బహిరంగ సభకు కూడా తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ చాంద్ బాషా తెలిపారు. కానీ తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ వెల్లడించారు.. మంత్రి పదవి ఇస్తానని చెప్పి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పిన చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లారు.. కానీ ఎక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదని మంత్రి పదవి ఇస్తామని చెప్పి కదిరి టికెట్ కూడా తనకే ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు చాంద్ బాషా.


మైనార్టీలను కేవలం ఓట్ల కోసమే మాత్రమే ఉపయోగించుకున్నారని ఈ విషయం పైన తనకు బాధ కలిగిందని అందుకే టిడిపికి రాజీనామా చేశానంటూ అత్తర్ చాంద్ బాషా తెలియజేశారు.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి కదిరి నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కదిరి నుంచి భారీ విజయాన్ని చాంద్ బాషా అందుకున్నారు.. అయితే ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టిడిపిలోకి చేరారు. 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదు. కందికుంట వెంకటప్రసాద్ను దింపారు అప్పట్లో.. ఇండియన్ హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు..ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో..దీంతో తాను సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్ననీ టిడిపికి రాజీనామా చేశారు. మేమంతా సిద్ధం సభతో భాగంగా సాయంత్రం కదిరికి రాబోతున్న సీఎం జగన్ సమక్షంలో చేరబోతున్నారట. దీంతో అక్కడ టిడిపి పార్టీకి మైనారిటీ ఓటర్ల దెబ్బ పడబోతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>