PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-much-is-pawan-majority-in-pithapuram-how-much-is-vanga-geeta-majoritya2c7127b-f7bb-4c62-be27-01935c8caa85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-much-is-pawan-majority-in-pithapuram-how-much-is-vanga-geeta-majoritya2c7127b-f7bb-4c62-be27-01935c8caa85-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం ఒకటి. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. 2019 ఎన్నికలలో భీమవరం - గాజువాక రెండో నియోజకవర్గాలలో పోటీ చేసిన‌ పవన్‌ రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి ఆ రెండు నియోజకవర్గాలను కాదనుకొని పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉంది. పైగా ఈ ఎన్నికలు జనసేనకు చావో రేవు లాంటివి. పైగా టిడిపి - బిజెపితAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena{#}Beach;96;Gajuwaka;Bhimavaram;June;pithapuram;kakinada;geetha;Ram Gopal Varma;kalyan;Bharatiya Janata Party;Janasena;Scheduled Tribes;Elections;Cycle;Hanu Raghavapudi;TDP;YCPపిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ ఎంత‌.. వంగా గీత మెజార్టీ ఎంత‌... షాకింగ్ లెక్క ఇది..!పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ ఎంత‌.. వంగా గీత మెజార్టీ ఎంత‌... షాకింగ్ లెక్క ఇది..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena{#}Beach;96;Gajuwaka;Bhimavaram;June;pithapuram;kakinada;geetha;Ram Gopal Varma;kalyan;Bharatiya Janata Party;Janasena;Scheduled Tribes;Elections;Cycle;Hanu Raghavapudi;TDP;YCPMon, 01 Apr 2024 16:31:26 GMTఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం ఒకటి. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. 2019 ఎన్నికలలో భీమవరం - గాజువాక రెండో నియోజకవర్గాలలో పోటీ చేసిన‌ పవన్‌ రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి ఆ రెండు నియోజకవర్గాలను కాదనుకొని పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉంది. పైగా ఈ ఎన్నికలు జనసేనకు చావో రేవు లాంటివి. పైగా టిడిపి - బిజెపితో కూటమికట్టి మరి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

మూడు పార్టీల మద్దతుతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కు పిఠాపురంలో ఎంత మెజార్టీ వస్తుంది ? ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటన్న దానిపై జనసేన, వైసిపి అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. పవన్ ఇటీవల నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గంలో 2.30 లక్షల ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో 1.80 లక్షల వరకు ఓట్లు పోల‌య్యే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఏకంగా 1.90 ల‌క్ష‌ల మంది ఉన్నారు.
పవన్ తనకు లక్ష ఓట్ల మెజార్టీ అని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే వైసీపీకి 40 వేల లోపు ఓట్లు మాత్రమే రావాలి.

కాపుల్లో మెజార్టీ ఓటింగ్ తో పాటు ఇతర కులాల్లో ఉన్న పవన్ అభిమానులు అటు టిడిపి ఓటర్లు.. బిజెపి సానుభూతిపరులు వీరంతా కలిసి తనకే ఓటేస్తారని పవన్ నమ్ముతున్నారు. అటు వంగా గీతా లెక్కలు వేరేలా ఉన్నాయి. కాపుల్లో సగం మంది తనకే ఓటేస్తారని.. మిగిలిన బీసీ.. ఎస్సీ.. ఎస్టీ ఓటర్లు కూడా తన వైపే మెజార్టీ ఉంటారని ఓవరాల్ గా తనకు కూడా భారీ మెజార్టీ వస్తుందని గీత లెక్కలు వేసుకుంటున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ జనసేనకు 28 వేల ఓట్లు వచ్చాయి. అప్పుడు టిడిపి నుంచి పోటీ చేసిన వర్మకు 68,000 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే మొత్తం 96 ఓట్లు అవుతాయి. రెండు పార్టీల మధ్య సరిగా ఓటు బదిలీ జరిగితే పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతోనే గెలుస్తారు.

ఇక వంగా గీత ఇక్కడ 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన అప్పట్లో ఆమెకు వచ్చిన మెజార్టీ కేవలం 500 మాత్రమే. 2014లో వర్మ ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆయనకు ఏకంగా 48 వేల‌ ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ సమయంలో ఆయనకు అన్ని పార్టీల ఓటర్లు నాయకులు సపోర్ట్ చేశారు. అయితే అదే వర్మ తర్వాత సైకిల్ సింబల్ మీద పోటీ చేస్తే ఆ స్థాయిలో ఓట్లు రాలేదు. ఇన్ని ఈక్వేషన్ల మధ్య పిఠాపురం ఓటర్ ఎవరికి పట్టం కడతారో అన్నది జూన్ 4న తేలిపోనుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>