PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202401288581-8b11-4f89-a3a5-d5352569e7a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-202401288581-8b11-4f89-a3a5-d5352569e7a7-415x250-IndiaHerald.jpgకర్నూల్ జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఆ ఫ్యామిలీ కర్నూల్ ని రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. అయితే నాగిరెడ్డి దంపతుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది.ఆ కుటుంబం ప్రాతనిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైనా కూడా. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ.. ప్రస్తుత ఎన్నికల్లో AP Elections 2024{#}Bhuma Akhila Priya;Allagadda;Bhuma Nagi Reddy;CBN;Reddy;Letter;Party;News;Bharatiya Janata Partyరాయలసీమ: పాపం అఖిలప్రియ.. ఫ్యామిలీయే ఎనిమీ అయిందిగా?రాయలసీమ: పాపం అఖిలప్రియ.. ఫ్యామిలీయే ఎనిమీ అయిందిగా?AP Elections 2024{#}Bhuma Akhila Priya;Allagadda;Bhuma Nagi Reddy;CBN;Reddy;Letter;Party;News;Bharatiya Janata PartyMon, 01 Apr 2024 11:24:00 GMTకర్నూల్ జిల్లాలో భూమా నాగిరెడ్డి కుటుంబం అంటే ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఆ ఫ్యామిలీ కర్నూల్ ని రాజకీయంగా దశాబ్దాల కాలం శాసించింది. అయితే నాగిరెడ్డి దంపతుల మరణం అనంతరం జిల్లాలో రాజకీయం పూర్తిగా మారిపోయింది.ఆ కుటుంబం ప్రాతనిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు అడ్డాగా ఉండేది. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైనా కూడా. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ.. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆమెకు సీటు ఇవ్వడమే పెద్ద విజయమని అంటుంటారు.అయితే, రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.ఇప్పుడు అదే జరిగింది. ఈసారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో దూసుకెళ్తున్న భూమా ఫ్యామిలీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఎందుకంటే భూమా నాగిరెడ్డి అన్న కొడుకు అయిన కిషోర్ రెడ్డి గత వారం వైసీపీలో చేరారు. దీని వల్ల భూమా క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోనుందని సమాచారం తెలుస్తుంది. దీని ప్రభావం భూమా అఖిలప్రియ విజయ అవకాశాలపై పడుతోంది.


భూమా ఫ్యామిలీలో చాలామంది అఖిల ప్రియకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు.కుటుంబంలో ఉన్న వారిలో చాలామంది ఈ మధ్యే మీటింగ్ పెట్టుకుని అఖిలప్రియకు  టికెట్ ఇవ్వద్దని ఒక లేఖ రాశారు. ఒక వేళ అఖిలకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతుందని  చెప్పారు. పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా కూడా చంద్రబాబు మాత్రం అఖిలప్రియకు మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించేశారు. ఇదిలా వుంటే, నాగిరెడ్డి అన్న కొడుకు కిషోర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరడం జరిగింది. బీజేపీ తరపున పోటీచేయాలని అనుకున్నా.. అనుకోని పరిస్థితుల్లో ఆయన వైసిపిలోకి వెళ్లారు.భూమా కిషోర్ వల్ల అఖిల ప్రియ గెలుపు కష్టమని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది. కిషోర్‌ రెడ్డి వైసిపిలోకి వెళ్లటంతో వారి బలం ఒక్కసారిగా పెరిగిందని సమాచారం తెలుస్తుంది. అలాగే భూమా నాగిరెడ్డి సహచరుడు ఏవి సుబ్బారెడ్డితో కూడా అఖిలప్రియకు విభేదాలు ఉన్నాయి.ఈ ఎన్నికల్లో అఖిలప్రియకి ఏవి సుబ్బారెడ్డి సహకరించే పరిస్థితి లేదు. ఇది ప్రత్యర్థులకు బలంగా మారవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>