PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poor-peopledb35824f-a1e9-4d55-8310-bc6133bcdfc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-poor-peopledb35824f-a1e9-4d55-8310-bc6133bcdfc8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నా సంక్షేమం విషయంలో మాత్రం ప్రజలు సంతృప్తితోనే ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ రేంజ్ లో సంక్షేమ పథకాలను అమలు చేయలేదని పేద ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ap poor people{#}Y. S. Rajasekhara Reddy;Election Commission;Government;CM;Reddy;Hanu Raghavapudi;Jagan;CBN;Andhra Pradeshఏపీ : రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొడుతున్న ఆ రెండు పత్రికలు.. జమ కాకుండా ఆపగలరా?ఏపీ : రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొడుతున్న ఆ రెండు పత్రికలు.. జమ కాకుండా ఆపగలరా?ap poor people{#}Y. S. Rajasekhara Reddy;Election Commission;Government;CM;Reddy;Hanu Raghavapudi;Jagan;CBN;Andhra PradeshMon, 01 Apr 2024 15:03:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నా సంక్షేమం విషయంలో మాత్రం ప్రజలు సంతృప్తితోనే ఉన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ రేంజ్ లో సంక్షేమ పథకాలను అమలు చేయలేదని పేద ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కామెంట్లు చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి.
 
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉందనే సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలుకు ముందే పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా జగన్ పలు పథకాల అమలు దిశగా అడుగులు వేశారు. వైఎస్సార్ చేయూతతో పాటు మరికొన్ని పథకాల బటన్లు నొక్కి దశల వారీగా నగదు పేద ప్రజల ఖాతాలో జమవుతుందని ఏ మాత్రం కంగారు పడవద్దని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన 2019 నుంచి అమలు చేస్తున్నారు.
 
అయితే జగన్ బటన్ నొక్కిన పథకాలు అమలైతే ఆ పార్టీకి ప్లస్ అవుతుందని భావించిన రెండు పత్రికలు ఏపీ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకాలు కొత్త పథకాలు కాకపోయినా ఈ పథకాల నగదు జమ కాకుండా కథనాలను ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈసీ నుంచి ఈ పథకాలకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ మాత్రం లేదు.
 
పేదవాళ్లకు మంచి చేసినా మంచి పథకాలను అమలు చేసినా ఓర్వలేనితనం ఆ రెండు పత్రిలకు ఎందుకని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతు రుణమాఫీ నాలుగో విడత, ఐదో విడత డబ్బులను రిలీజ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించినా ఒక్క రైతు ఖాతాలో కూడా ఆ నగదు జమ కాలేదు. ఆ రెండు పత్రికలు ప్రజలకు మంచి చేయకపోయినా పరవాలేదని చెడు చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>