PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-mla-kalavaticc033bae-f5b4-4691-8bc3-5b60dd67456a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-mla-kalavaticc033bae-f5b4-4691-8bc3-5b60dd67456a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కళావతికి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. పాలకొండ మండలం వెలగవాడలో ఎమ్మెల్యే కళావతి ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు.. వైసిపి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను వివరిస్తూ ఉండగా.. అడుగడుగున ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు.. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో తమకు రాలేదంటూ వాగ్వాదానికి దిగారు. స్థానిక నాయకులు కొంతమంYCP;MLA;KALAVATI{#}mandalam;local language;YCP;MLAఏపీ: అడుగుపెట్టిందో లేదో.. వైసీపీ ఎమ్మెల్యేకి చుక్కలు..!ఏపీ: అడుగుపెట్టిందో లేదో.. వైసీపీ ఎమ్మెల్యేకి చుక్కలు..!YCP;MLA;KALAVATI{#}mandalam;local language;YCP;MLAMon, 01 Apr 2024 11:04:53 GMTఆంధ్రప్రదేశ్లోని వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతం ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కళావతికి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. పాలకొండ మండలం  వెలగవాడలో ఎమ్మెల్యే కళావతి ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు.. వైసిపి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను వివరిస్తూ ఉండగా.. అడుగడుగున ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు.. ముఖ్యంగా ఇళ్ల స్థలాల విషయంలో తమకు రాలేదంటూ వాగ్వాదానికి దిగారు.


స్థానిక నాయకులు కొంతమంది.. తమకు ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డుకున్నారనీ మహిళలు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. మరి కొంతమంది కొండలలో ఇళ్ల స్థలం ఇచ్చారంటూ కూడా వాపోతున్నారు. అయితే ఏదో ఒకటి ఇచ్చాం కదా అనే విధంగా అక్కడే స్థానిక నేతలు సర్దిపుచ్చే ప్రయత్నం చేశారు.. మరో మహిళ పింఛన్ నిలిపివేశారు అంటూ మండిపడ్డారు.. అలాగే ఎమ్మెల్యేతో అక్కడ ఉన్న సమస్యల గురించి వివరించడానికి వెళ్ళిన మహిళలను కూడా అక్కడ నేతలు అడ్డుకున్నారు. అక్కడి నేతలు, ప్రజల మధ్య నిరసనల సెగ చాలా రసవత్తంగా మారుతోంది.


మణ్యం జిల్లాలోని సమస్యలతో ఎమ్మెల్యేను మహిళలు సైతం అడ్డుకుంటున్నారు.. ముఖ్యంగా తమకు ఇచ్చినటువంటి హామీలను సైతం అమలు చేయకుండా ఎందుకు వచ్చావు అంటూ కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు.. అక్కడ ప్రశ్నిస్తున్న వారిని అడ్డుకునేందుకు ఆమె అనుచరులు సైతం ప్రయత్నించారు.. ఈ విషయం పైన మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో..తప్పు జరిగిందంటూ ఎమ్మెల్యే కళావతి అక్కడ నుంచి వెనుతిరిగిపోయినట్టుగా తెలుస్తోంది.. ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్.. తమను నిండా మోసం చేశారని.. ప్రజలు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో చంద్రబాబును గెలిపించుకుంటామంటూ తేల్చి చెప్పారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా పలు రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోకుండా ఇప్పుడు మళ్లీ అధికారం కోసం తాపత్రయ పడుతున్న ఇలాంటి అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాటమే చెబుతున్నారు. అందుకే అలా అడుగు పెట్టిందో లేదో ప్రజలు చుక్కలు చూపించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>