PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan-hyd-going-feavere6151c9e-be94-4809-acb1-2ebae151ae89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawankalyan-hyd-going-feavere6151c9e-be94-4809-acb1-2ebae151ae89-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాటు తమ అభ్యర్థులను గెలిపించాలనే కసి తో ముందుకు వెళుతున్నారు.. ఇందులో భాగంగా కూటమిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.. ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న కథనం ప్రకారం.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..యాత్ర పేరిట ప్రజలలో మమేకం అవుతూ.. ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే .. అయితే ప్రచారం ప్రారంభించిన రెండవ రోజే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బ తినింది.. ఆంధ్రాలో చేపట్టిన ప్రచార యాత్రలోPAWANKALYAN;HYD;GOING;FEAVER{#}Saturday;Kathanam;pithapuram;sunday;kalyan;Hyderabad;Janasena;India;News;Bharatiya Janata Party;YCP;Assembly;MP;Partyపవన్: అకస్మాత్తుగా.. హఠాత్తుగా.. హైదరాబాద్ కు ఎందుకు..?పవన్: అకస్మాత్తుగా.. హఠాత్తుగా.. హైదరాబాద్ కు ఎందుకు..?PAWANKALYAN;HYD;GOING;FEAVER{#}Saturday;Kathanam;pithapuram;sunday;kalyan;Hyderabad;Janasena;India;News;Bharatiya Janata Party;YCP;Assembly;MP;PartyMon, 01 Apr 2024 08:00:00 GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పాటు తమ అభ్యర్థులను గెలిపించాలనే కసి తో ముందుకు వెళుతున్నారు.. ఇందులో భాగంగా కూటమిలో ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు.. ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న కథనం ప్రకారం.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు  గురయ్యారు..యాత్ర పేరిట ప్రజలలో మమేకం అవుతూ.. ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే .. అయితే ప్రచారం ప్రారంభించిన రెండవ రోజే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బ తినింది.. ఆంధ్రాలో చేపట్టిన ప్రచార యాత్రలో భాగంగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది.


దీంతో హుటాహుటిగా హైదరాబాద్ కి  పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది.. దీంతో పవన్ అభిమానులు, జనసేన సైనికులు కూడా ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాలు..2 ఎంపి స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.. శనివారం రోజు నుంచి తను వారాహి యాత్రను మొదలుపెట్టారు.. కానీ ఆదివారం రోజున పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ టిడిపి, బిజెపి నాయకులతో కూడా సమావేశమయ్యారు.


ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. ఈసారి ఎన్నికలలో తనను గెలిపించాలంటే ఒక ప్రణాళికను కూడా అక్కడ ఉండే నాయకులకు పూర్తి విశ్లేషణతో వివరణ ఇచ్చారు.. ఈసారి ఎలాగైనా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని.. మూడు పార్టీలకు కూడా తెలియజేశారు.. అలాగే పవన్ కళ్యాణ్ తొలిసారి కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 40 రోజులలో మూడు పార్టీల కార్యకర్తలు ఒక దీక్షతో పని చేద్దామని.. వైసిపి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ తెలియజేశారు.. అయితే నిన్నటి రోజున అస్వస్థతకు గురవడంతో ఒకసారిగా హైదరాబాదుకు బయలుదేరాడు పవన్ కళ్యాణ్..


ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు.. పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఎండకు వడదెబ్బ తగలడం చేత తీవ్రస్తవస్థకు గురవడంతో.. వెంటనే హుటాహుటిగా పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ కి తరలించినట్లు.. ఎయిర్ పోర్ట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు కలవర పాటకు గురయ్యారు అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఇక ఎప్పటిలాగే షెడ్యూల్ ప్రకారమే రేపటి నుంచి మళ్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు అని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>