PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brs-to-lose-more-mp-candidates6fef0cb1-6fcb-41fe-a77b-7253edfba927-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/brs-to-lose-more-mp-candidates6fef0cb1-6fcb-41fe-a77b-7253edfba927-415x250-IndiaHerald.jpgకొంతమంది నాయకులు అధికారం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో చేరిపోతారు. అధికారం లేకుండా నాలుగు రోజులు కూడా ఉండలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ నుండి కూడా అలాంటి నేతలు మెల్లిమెల్లిగా జారుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి నాలుగు నెలలు గడవకముందే అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలా పార్టీ మారుతున్న వారిలో సీనియర్ నేతలు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా కేకే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి నేతలు పార్టీ మారడం బీఆర్ఎస్ శ్రేణులను భారీ షాక్ కు గురిచేసింbrs{#}Danam Nagender;srihari;Warangal;Parliament;local language;Assembly;MP;MLA;Congress;Partyగెలుపు ముచ్చ‌ట త‌ర‌వాత‌..వాళ్ల‌ను ఓడించ‌డ‌మే బీఆర్ఎస్ టార్గెటా..?గెలుపు ముచ్చ‌ట త‌ర‌వాత‌..వాళ్ల‌ను ఓడించ‌డ‌మే బీఆర్ఎస్ టార్గెటా..?brs{#}Danam Nagender;srihari;Warangal;Parliament;local language;Assembly;MP;MLA;Congress;PartyMon, 01 Apr 2024 14:56:16 GMTకొంతమంది నాయకులు అధికారం ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో చేరిపోతారు. అధికారం లేకుండా నాలుగు రోజులు కూడా ఉండలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ నుండి కూడా అలాంటి నేతలు మెల్లిమెల్లిగా జారుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి నాలుగు నెలలు గడవకముందే అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలా పార్టీ మారుతున్న వారిలో సీనియర్ నేతలు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు కూడా ఉండటం విశేషం.

ముఖ్యంగా కేకే, కడియం శ్రీహరి, దానం నాగేందర్ లాంటి నేతలు పార్టీ మారడం బీఆర్ఎస్ శ్రేణులను భారీ షాక్ కు గురిచేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానంతో పాటు నేతలు, కార్యకర్తలు వీరిపై సీరియస్ గా ఉన్నారు. కొంతమంది నేతలు అయితే పార్టీ మారిన వారిని ఓడించి తీరుతామని... రాజకీయ సమాధి చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ను ఇచ్చింది.

అయితే కడియం శ్రీహరి మాత్రం ఆయన కూతురు కావ్య‌తో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. వరంగల్ లో బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థి దొరకకుండా కడియం ద్రోహం చేశాడంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. కావ్యను కచ్చితంగా ఓడిస్తామని...కడియంకు రాజ‌కీయ స‌మాధి క‌డ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కూడా క‌డియం తీరుపై చాలా అసంతృప్తితో ఉంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానంను సైతం ఓడించి తీరుతామని స్థానిక బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ లు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వీడిన నేత‌ల‌కు గ‌ట్టిగానే స‌మాధానం చెప్పాల‌ని భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అలా చేస్తేనే పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న మిగితా నేతలు కూడా వెన‌క్కి త‌గ్గుతార‌ని భావిస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>