PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024878bbef7-5e76-41fa-82a8-ccd086d80169-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-elections-2024878bbef7-5e76-41fa-82a8-ccd086d80169-415x250-IndiaHerald.jpgఉత్తరాంధ్ర: మాడుగుల సీటు అటు వైసీపీకి ఇటు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ విషయానికి వస్తే.. కచ్చితంగా గెలిచే సీటని అందరూ అనుకుంటూ వచ్చారు.ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడు హ్యాట్రిక్ కొట్టి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని అనుకున్నారు. కానీ సీఎం జగన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. ఆయనను తీసుకువచ్చి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా చేశారు.బూడి మాడుగుల సీటులో ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లె అనూరాధకు టికెట్ ఇచ్చింది వైసీపీ. తండ్రీ కుమార్తె ఇద్దరికీ న్యాయం జరిగింAP Elections 2024{#}ravi anchor;D Ramanaidu;Nimmala Ramanaidu;Pendurthi;Anakapalle;Raccha;Kumaar;TDP;YCP;MP;Telangana Chief Minister;Minister;CM;MLAఉత్తరాంధ్ర: వైసీపీ టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ సీటు?ఉత్తరాంధ్ర: వైసీపీ టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ సీటు?AP Elections 2024{#}ravi anchor;D Ramanaidu;Nimmala Ramanaidu;Pendurthi;Anakapalle;Raccha;Kumaar;TDP;YCP;MP;Telangana Chief Minister;Minister;CM;MLAMon, 01 Apr 2024 12:33:17 GMTఉత్తరాంధ్ర: మాడుగుల సీటు అటు వైసీపీకి ఇటు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ విషయానికి వస్తే.. కచ్చితంగా గెలిచే సీటని అందరూ అనుకుంటూ వచ్చారు.ఉప ముఖ్యమంత్రి అయిన బూడి ముత్యాలనాయుడు హ్యాట్రిక్ కొట్టి మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని అనుకున్నారు. కానీ సీఎం జగన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. ఆయనను తీసుకువచ్చి అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా చేశారు.బూడి మాడుగుల సీటులో ఆయన కుమార్తె కె కోటపాడు జెడ్పీటీసీ అయిన ఈర్లె అనూరాధకు టికెట్ ఇచ్చింది వైసీపీ. తండ్రీ కుమార్తె ఇద్దరికీ న్యాయం జరిగిందని బూడి అభిమానులతో పాటు వైసీపీ కూడా అనుకుంది. ఇద్దరూ విజేతలే అని సంబరాలు కూడా చేసుకున్నారు.కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ జరిగింది.


బూడి కుమారుడు రవి ఇపుడు ఎదురు తిరుగుతున్నారు. ఆయన అక్కడ తన తండ్రికి వ్యతిరేకంగా తన చెల్లెలుకు పోటీ వస్తున్నారు.ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని అంటున్నారు. అదే జరిగితే బూడి ఫ్యామిలీలో రేగే చిచ్చు వైసీపీ ఓట్లకు చిల్లు పెడుతుంది. అలా ఎమ్మెల్యే అభ్యర్ధి అనూరాధతో పాటు ఎంపీ అభ్యర్ధి బూడి  విజయావకాశాల మీద దెబ్బ పడుతుందని అంటున్నారు. బూడి ఎంపీగా గెలవాలంటే మాడుగులలో భారీ మెజారిటీ రావాలి. అక్కడే ఓట్లకు కన్నం పడితే ఇక ఎంపీగా విజయావకాశాలు ఎలా ఉంటాయన్న చర్చ నడుస్తుంది. బూడి కుమారుడికి నచ్చచెప్పి పోటీ నుంచి విరమించేలా చూస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది.


మరో వైపు టీడీపీలో కూడా రచ్చ సాగుతోంది. అక్కడ టీడీపీలో మొత్తం మూడు వర్గాలు ఉన్నాయి. ఆ మూడూ యాక్టివ్ గా ఉన్నాయి. వీటిలో ఎన్నారై వర్గంగా ఉన్న పైలా ప్రసాదరావుకు టికెట్ ఇచ్చారు. దాంతో ఇంచార్జిగా ఉన్న పీవీజీ కుమార్ కోప్పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అయితే కోపంతో రగిలిపోతున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని అనుచరులు  ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఆలోచనలో పడింది. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. అదే  జరిగితే బండారు మాడుగులకు షిఫ్ట్ అవుతారు.అయినా కానీ ఈ మూడు వర్గాలు ఒక్కటిగా నిలిచి బండారుకు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం  కనిపించడం లేదు. ఇదిలా ఉంటే బూడి ఫ్యామిలీలో చిచ్చు వైసీపీని ఇబ్బంది పెడుతూంటే టీడీపీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>