PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-charababu-naidub2ddeee0-467e-430f-91a6-19b790fb1d64-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-charababu-naidub2ddeee0-467e-430f-91a6-19b790fb1d64-415x250-IndiaHerald.jpgవచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ నేతలను ఓడించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగా తపన పడుతున్నారు. ముఖ్యంగా కీలక స్థానాలలో నిలబడిన అభ్యర్థులను ఓడించి సీఎం జగన్‌కు షాక్ ఇవ్వాలని తెగ ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా కడప లోక్‌సభ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. జగన్ కు పెద్ద షాక్ ఇవ్వాలని చాలా రోజులుగా చాలా విధాలుగా ఆలోచిస్తూ వస్తున్నారు.nara charababu naidu{#}kushi;Kushi;AdiNarayanaReddy;devineni avinash;kadapa;Jagan;CBN;Reddy;YCP;MLA;TDP;Assembly;CM;Bharatiya Janata Partyఆంధ్రప్రదేశ్: ఆ టీడీపీ నేతని బలి పశువును చేసిన చంద్రబాబు.. కడపపై ఆశలు గల్లంతు..!ఆంధ్రప్రదేశ్: ఆ టీడీపీ నేతని బలి పశువును చేసిన చంద్రబాబు.. కడపపై ఆశలు గల్లంతు..!nara charababu naidu{#}kushi;Kushi;AdiNarayanaReddy;devineni avinash;kadapa;Jagan;CBN;Reddy;YCP;MLA;TDP;Assembly;CM;Bharatiya Janata PartyMon, 01 Apr 2024 08:01:37 GMTవచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ నేతలను ఓడించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగా తపన పడుతున్నారు. ముఖ్యంగా కీలక స్థానాలలో నిలబడిన అభ్యర్థులను ఓడించి సీఎం జగన్‌కు షాక్ ఇవ్వాలని తెగ ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా కడప లోక్‌సభ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నారు. జగన్ కు పెద్ద షాక్ ఇవ్వాలని చాలా రోజులుగా చాలా విధాలుగా ఆలోచిస్తూ వస్తున్నారు.

ఈ స్థానం నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతటి స్ట్రాంగ్ క్యాండిడేట్‌ని ఓడించి గెలవడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీలో అవినాష్ రెడ్డిని ఓడించే వారు ఎవరా అని చంద్రబాబు అనేక పేర్లను పరిశీలించారు. చివరికి ఎవరూ సమర్థులు దొరకక ఓడిపోవడానికి ఎవరైతేనేం అనే ఆలోచనలో జమ్మల మడుగు టీడీపీ ఇన్‌ఛార్జీ భూపేష్ రెడ్డిని కడప అభ్యర్థిగా ప్రకటించారు.

నిజానికి అతను కూడా ఆ స్థానం నుంచి తనకి పోటీ చేసే అవకాశం వస్తుందని ఊహించి ఉండరు. ఈ స్థానంలో పోటీ చేయాలని ఎవరూ కూడా ఆశించరు. ఎందుకంటే గెలిచే ఛాన్సులు చాలా తక్కువ కాబట్టి. ఫలితంగా భూపేష్ రెడ్డి కంగుతిన్నారు. తనని ఇలా బలి ఇస్తారని అనుకోలేదు కాబట్టి ఇప్పటికీ షాక్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
జమ్మల మడుగు ఎమ్మెల్యే కావాలని చాలా కాలంగా ప్రయత్నించారు కానీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు. కనీసం తన కుమారుడి రూపంలోనైనా అక్కడినుంచి గెలిచి తన కోరికను తీర్చుకోవాలి అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే గత మూడేళ్లుగా జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీని బలోపేతం చేయడానికి చాలానే కష్టపడ్డారు. అతను పడ్డ ఇంత కష్టానికి కొంచెం కూడా ప్రతిఫలం దక్కలేదు. టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి జమ్మలమడుగు సీటును ఇచ్చేసింది.

 దీనిని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డికి అందజేశారు. అయితే భూపేష్ రెడ్డిని బుజ్జగించాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. తనని కాదని వేరే వారికి సీటు ఇస్తే భూపేష్ రెడ్డి కోపం తెచ్చుకొని బీజేపీ అభ్యర్థికి ఎలాంటి మద్దతు ఇవ్వకపోవచ్చు. దీనివల్ల చంద్రబాబుకి మైనస్. కేవలం ఆదినారాయణరెడ్డి గెలుపు కోసమే చంద్రబాబు భూపేష్‌ను కడప లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించి అతనిని ఖుషి చేసే ప్రయత్నం చేశారు. కానీ బలిపశును చేసినట్లు భూపేష్‌ కు అర్థమయ్యే ఉంటుంది. భూపేష్‌ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు కొంచెం కూడా ఆలోచించలేదు. తన స్వప్రయోజనాల కోసమే అతనికి ఆ సీటును అందించారు. అది కూడా గెలవని సీట్ కావడంతో భూపేష్ రెడ్డితో పాటు అతని అనుచరులు, మద్దతుదారులు చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. నారా లోకేష్‌కు కూడా ఇలాగే అన్యాయం చేస్తారా అని టీడీపీ సపోటర్లు ప్రశ్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>