PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections7e2d78a5-6018-447a-8adf-14a1b279eee3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/assembly-elections7e2d78a5-6018-447a-8adf-14a1b279eee3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు పార్టీ అభ్యర్థుల మధ్య హోరా హోరిగా మాటల యుద్ధం జరుగుతుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. అయితే అలాంటి ప్రాంతాలలో ఒకటైన పల్నాడుగడ్డ అయినా వినుకొండలో కూడా అధికార పార్టీ వైసీపీ కాండిడేట్ అయినా బొల్లా బ్రహ్మానాయుడు అలాగే టీడీపీ అభ్యర్థి ఐనా జీవీ ఆంజనేయులు మధ్య మాటలు తూటాల్లాగా పేలుతున్నాయి. అయితే ఈ మాటల ధాటి విమర్శలు,ప్రతివిమర్శలు,సవాళ్ల నుండి అసభ్య దూషణల వరకు వెళ్తున్నాయి.అందులో భాగంగా తాజాగా వినుకొండ assembly elections{#}Sri Krishna;Vinukonda;Bolla Brahmanaidu;politics;MP;Party;Elections;Election;war;TDP;YCP;mediaపల్నాడు : పచ్చి బూతులతో రెచ్చిపోయి నేనేంటో చూపిస్తానంటున్న ఎమ్మెల్యే....!!పల్నాడు : పచ్చి బూతులతో రెచ్చిపోయి నేనేంటో చూపిస్తానంటున్న ఎమ్మెల్యే....!!assembly elections{#}Sri Krishna;Vinukonda;Bolla Brahmanaidu;politics;MP;Party;Elections;Election;war;TDP;YCP;mediaMon, 01 Apr 2024 18:49:34 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయాలు పార్టీ అభ్యర్థుల మధ్య హోరా హోరిగా మాటల యుద్ధం జరుగుతుంది. ఇంకొన్ని ప్రాంతా ల్లో అయితే ఏకంగా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. అయితే అలాంటి ప్రాంతాలలో ఒకటైన పల్నాడుగడ్డ అయినా వినుకొండ లో కూడా అధికార పార్టీ వైసీపీ కాండిడేట్ అయినా బొల్లా బ్రహ్మానాయుడు అలాగే టీడీపీ అభ్యర్థి ఐనా జీవీ ఆంజనేయులు మధ్య మాటలు తూటాల్లాగా పేలుతున్నాయి.

అయితే ఈ మాటల ధాటి విమర్శలు,ప్రతివిమర్శలు,సవాళ్ల నుండి అసభ్య దూషణల వరకు వెళ్తున్నాయి.అందు లో భాగం గా తాజా గా వినుకొండ ఎమ్మెల్యే అయినా బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అసభ్య దూషణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీ.వీ.ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై చేసిన కీలక వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని హీట్ పుట్టిస్తున్నాయి. మీడియా సమావేశం అని మర్చిపోయి పచ్చి బూతులు తిట్టారు బ్రహ్మానాయుడు.టీడీపీ అభ్యర్థులు,నేతలు అందరూ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఎలక్షన్స్ అయిపోయాక అధికారంలో వైసీపీ రాంగానే నేనేంటో చూపిస్తా కొడకల్లారా అంటూ అసభ్యకర సంభాషణలు చేసారు.

బొల్లా బ్రహ్మ నాయుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యల పై వైసీపీ నేతలు కొద్దిసేపు స్టన్ అయిపోయి దాని నుండి తేరుకొని అయన పై మండిపడ్డారు. ఎన్నికల టైం లో పోటీ అనేది ఉండాలి కానీ మరీ ఇలాంటి మాటలు మాట్లాడితే సహించబొమని అన్నారు.ఇప్పటికే అయిదు సంవత్సరాల నుండి ప్రజలు పార్టీ పై  వ్యతిరేకత చూపిస్తున్నారని ఈ ఎన్నికల్లో వైసీపీ సర్దుకోవడమేనని గుర్తుచేశారు.ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో వైసీపీని ఇంటికి సాగనంపడానికి ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.ఏదేమైనా బొల్లా చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నాయకులు కోపం తో రగిలిపోతూ నోరు అదుపు లో పెట్టుకోమని హెచ్చరిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>