PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/that-handsome-leader-in-tdp-is-likely-to-win-this-time9238c1c6-677b-4b2b-b91a-343f9424695a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/that-handsome-leader-in-tdp-is-likely-to-win-this-time9238c1c6-677b-4b2b-b91a-343f9424695a-415x250-IndiaHerald.jpgఆరిమిల్లి రాధాకృష్ణ టిడిపి తణుకు మాజీ ఎమ్మెల్యే. తాజా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి తణుకులో పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికలలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తణుకు నుంచి పోటీచేసి ఏకంగా 33,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో రాధాకృష్ణను చాలామంది హ్యాండ్‌సం ఎమ్మెల్యే అని పిలుచుకునేవారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈ యంగ్ లీడ‌ర్ తెలుగుదేశం పార్టీకి 25 ఏళ్ల పాటు చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా త‌ణుకులో రాజ‌కీయం న‌డిపిస్తార‌న్న అంచ‌నాలు రాధాపై గటAP-Assembly-Elections; AP-Elections-Survey; telangana-parliament-elections; Andhrapradesh-Assembly-Election ;Assembly-Elections-2024; Arimilli Radha Krishna; TDP; MLA Arimilli Radha Krishna; Arimilli Radha Krishna Add a tag{#}Akkineni Nageswara Rao;Tanuku;Vemuri Radhakrishna;Janasena;Telugu Desam Party;Minister;TDP;YCP;Congress;MLA;Hanu Raghavapudi;Air;Partyగోదావ‌రి: టీడీపీలో ఆ హ్యాండ్‌స‌మ్ లీడ‌ర్ ఈ సారి భారీ విక్ట‌రీ ప‌క్కానా..!గోదావ‌రి: టీడీపీలో ఆ హ్యాండ్‌స‌మ్ లీడ‌ర్ ఈ సారి భారీ విక్ట‌రీ ప‌క్కానా..!AP-Assembly-Elections; AP-Elections-Survey; telangana-parliament-elections; Andhrapradesh-Assembly-Election ;Assembly-Elections-2024; Arimilli Radha Krishna; TDP; MLA Arimilli Radha Krishna; Arimilli Radha Krishna Add a tag{#}Akkineni Nageswara Rao;Tanuku;Vemuri Radhakrishna;Janasena;Telugu Desam Party;Minister;TDP;YCP;Congress;MLA;Hanu Raghavapudi;Air;PartySun, 31 Mar 2024 14:21:12 GMTఆరిమిల్లి రాధాకృష్ణ టిడిపి తణుకు మాజీ ఎమ్మెల్యే. తాజా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి తణుకులో పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికలలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తణుకు నుంచి పోటీచేసి ఏకంగా 33,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో రాధాకృష్ణను చాలామంది హ్యాండ్‌సం ఎమ్మెల్యే అని పిలుచుకునేవారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈ యంగ్ లీడ‌ర్ తెలుగుదేశం పార్టీకి 25 ఏళ్ల పాటు చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా త‌ణుకులో రాజ‌కీయం న‌డిపిస్తార‌న్న అంచ‌నాలు రాధాపై గట్టిగా ఉండేవి.

2014 - 2019 మ‌ధ్య ఐదేళ్లపాటు తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. రాధాకృష్ణ కాంట్రవర్సీ రాజకీయాలకు దూరంగా తన పని తాను చేసుకుపోతూ ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు వెళ్లారు. సామాజిక సమీకరణలపరంగా కూడా నియోజకవర్గంలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికలలో వైసిపి ప్రభంజనంతో పాటు తన నియోజకవర్గంలో జనసేన 30 వేల పైచిలుకు ఓట్లు చీల్చినా కూడా రాధా కేవలం 1000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా ఐదేళ్ల పాటు రాధా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేయ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్‌కు ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నారు.

రాధా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచి.. మ‌రోసారి ఓడిపోయినా కూడా వివాదాల‌కు ఆమ‌డ దూరంలోనే ఉంటూ వ‌చ్చారు. ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో సాఫ్ట్ ఇమేజ్ ఉంది. ఎవ‌రు వెళ్లినా రిసీవ్ చేసుకునే తీరు అంద‌రికి న‌చ్చుతుంది. ఇక ప్రస్తుతం తణుకులో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతున్నారు కారుమురికి ప్రక్షాళనలో మంత్రి పదవి వచ్చిన ఆయన మంత్రిగా ఉన్న తణుకుకు చేసిందేమీ లేదు.

విచిత్రం ఏంటంటే కారుమూరి 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్పుడే కాస్తో కూస్తో అభివృద్ధి చేశాడే త‌ప్పా ఇప్పుడు ఒరిగిందేమి లేద‌ని వైసీపీ వాళ్లే పెద‌వి విరుస్తున్నారు. ఇక జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లోనే ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్లు సాధించింది. ఈ సారి సీటు ఆశించినా రాధా కేవ‌లం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోవ‌డంతో కూట‌మిలో ఆయ‌న‌కే టీడీపీ సీటు ద‌క్కింది. ఇప్పుడు జ‌న‌సేన ఓట్లు కూడా టీడీపీకి యాడ్ అవుతున్నాయి. ఇక్క‌డ కాపుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానుల్లో చాలా మంది గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓట్లు వేసినా ఈ సారి మాత్రం ఎలాగైనా కూట‌మిని గెలిపించుకోవాల‌ని క‌సితో ఉన్నారు.

అందులోనూ జ‌న‌సేన‌, ప‌వ‌న్ అభిమానుల్లో రాధాను కూడా వ్య‌క్తిగ‌తంగా అభిమానించే వాళ్లూ ఎక్కువే. ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు వీరితో చాలా స‌ఖ్య‌త‌తో ఉండ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క ప‌ద‌వులు కాపు వ‌ర్గానికి క‌ట్ట‌బెట్టారు. ఏదేమైనా ఈ సారి త‌ణుకులో రాధా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచే విష‌యంలో ఎలాంటి డౌట్లు లేవు. కూట‌మి గాలి బాగా వీస్తే మ‌రోసారి రాధా మెజార్టీ 30 వేల పైనే అంటున్నారు. వైసీపీ గట్టి పోటీ ఇచ్చినా రాధా గెలుపున‌కు ఢోకా ఉండ‌క‌పోవ‌చ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>