MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి మోహన్ బాబులు ప్రాణస్నేహితులు. అయితే ఆతరువాత మారిన పరిస్థితులలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆగ్యాప్ వారిద్దరి మధ్య అనేక సందర్భాలలో మాటల యుద్ధానికి కూడ దారితీసింది. వారిద్దరి మధ్య పరిస్థితి అలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మంచు మనోజ్ లు మాత్రం చిన్ననాటి నుండి మంచి స్నేహితులు. అయితే ఈవిషయాన్ని వారు బయటకు చెప్పుకోరు. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఈమధ్యనే మళ్ళీ ఈటీవీ కోసం ఒక టాక్ షోను హోస్ట్ చేసి ఈమధ్య మళ్ళీ వార్తలలోకి వచ్చాడramcharan{#}manchu manoj kumar;Dubai;Ram Charan Teja;Chiranjeevi;Telugu;Smart phoneరామ్ చరణ్ మంచి తనం పై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ !రామ్ చరణ్ మంచి తనం పై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ !ramcharan{#}manchu manoj kumar;Dubai;Ram Charan Teja;Chiranjeevi;Telugu;Smart phoneSat, 30 Mar 2024 09:00:00 GMTఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరంజీవి మోహన్ బాబులు ప్రాణస్నేహితులు. అయితే ఆతరువాత మారిన పరిస్థితులలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆగ్యాప్ వారిద్దరి మధ్య అనేక సందర్భాలలో మాటల యుద్ధానికి కూడ దారితీసింది. వారిద్దరి మధ్య పరిస్థితి అలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మంచు మనోజ్ లు మాత్రం చిన్ననాటి నుండి మంచి స్నేహితులు.



అయితే ఈవిషయాన్ని వారు బయటకు చెప్పుకోరు. కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ ఈమధ్యనే మళ్ళీ ఈటీవీ కోసం ఒక టాక్ షోను హోస్ట్ చేసి ఈమధ్య మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. లేటెస్ట్ గా జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు అతిధిగా వచ్చిన మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి ఒక విషయాన్ని బయటపెట్టి ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించాడు.  



2018లో ఒక తెలుగు కుటుంబం దుబాయ్ లో అనుకోని పరిస్థితుల వల్ల చిక్కుల్లో ఇరుక్కుని పాస్ పోర్ట్ వీసా చేతిలో లేక ఇబ్బందులలో ఉన్నప్పుడు తనకు ధన సహాయం చేయమని ఫోన్ వచ్చిన విషయాన్ని తెలియచేశాడు. అయితే ఆ ఇబ్బందులలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి అంటే చాల ధనం లక్షలలో అవసరం అనీ అందువల్ల ఆయవ్యక్తికి తాను పూర్తిగా ధన సహాయం చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.



అయితే ఆ ఇబ్బందులలో ఉన్న వ్యక్తి నుండి తనకు తరుచూ ఫోన్ కాల్స్ వస్తూ ఉండటంతో ఏమి చేయాలో తెలియక తాను రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఆ విషయాన్ని వివరించినప్పుడు చరణ్ మరొకసారి  ఆలోచించకుండా కేవలం 5 నిముషాల వ్యవధిలో చరణ్ ఆ ఇబ్బంధులలో ఉన్న వ్యక్తికి 5 లక్షలు పంపించి తన ఉదారతను చాటుకున్న విషయాన్ని తెలియచేశాడు. వాస్తవానికి ఆవ్యక్తి ఎవరో కూడ చరణ్ కు తెలియదని ఎవరైనా కష్టాలలో ఉంటే చరణ్ స్పందన వేరుగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>