Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd56c5660-5665-4f33-8fe2-ceee464c3614-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd56c5660-5665-4f33-8fe2-ceee464c3614-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి... ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఎవరికి వారు బలమైన నినాదాలు చేస్తున్నారు.గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి.రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో ఎవ#assembly elections{#}Andhra Pradesh;Survey;Yevaru;India;Assembly;YCP;Janasena;Party;TDPఏపీ ఎలక్షన్స్ 2024 : విజేత ఎవ‌రో వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది..!ఏపీ ఎలక్షన్స్ 2024 : విజేత ఎవ‌రో వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది..!#assembly elections{#}Andhra Pradesh;Survey;Yevaru;India;Assembly;YCP;Janasena;Party;TDPSat, 30 Mar 2024 16:15:49 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది.. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి... ఈసారి ఎన్నికల్లో తమదే విజయం అంటూ ఎవరికి వారు బలమైన నినాదాలు చేస్తున్నారు.గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి.రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు  వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలు రచిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు విజయం సాధిస్తారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్ధితులపై మరో సర్వే ఫలితాలు వెలువడ్డాయి.2018 నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో సర్వేలు చేస్తున్న వైబ్రాంట్ ఇండియా అనే సంస్ధ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. 

ఇందులో రాష్ట్రంలో వైసీపీకీ మరియు ఎన్డీయే కూటమికీ తీవ్రమైన పోరు నెలకొనబోతుందని తేల్చి చెప్పేసింది. అంతే కాదు పలు చోట్ల హోరాహోరీ పోరు సాగబోతోందని ఈ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 175 సీట్లలో 29 స్ధానాల్లో పరిస్ధితి నువ్వా నేనా అన్నట్లు సాగనున్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడించింది.అయితే రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుదెబ్బ ఖాయమని వైబ్రాంట్ ఇండియా సర్వే తేల్చేసింది. వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఎన్డీయే కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన 115 నుంచి 120 సీట్లు కైవసం చేసుకుంటాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. వైసీపీ కేవలం 55 నుంచి 60 సీట్లకే పరిమితం కానుందని ఈ సర్వే ఫలితాలు తెలిపాయి. అయితే వైసీపీ 29 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని, మరో 18 సీట్లలో తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది. అలాగే ఎన్డీయే పార్టీలు 79 సీట్లు కచ్చితంగా గెలుస్తాయని, మరో 20 సీట్లలో  తీవ్రమైన పోరు ఉంటుందని తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>