MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk99ec55dc-30fc-4ce8-9902-f065f289a06a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sk99ec55dc-30fc-4ce8-9902-f065f289a06a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నప్పటికీ ఈయన ఎప్పుడు రొటీన్ సినిమాలలో నటించకుండా వైవిధ్యమైన కథాంశాలతో రూపొందిన సినిమాలలో నటిస్తూ రావడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సందీప్ ఆఖరుగా ఊరి పేరు భైరవకోన అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్షా బొల్లమ్మ , కావ్య దాపరి మూవీ లో హీరోయిన్ లుగా నటింSk{#}atreya;sandeep;sundeep kishan;V I Anand;Heroine;Posters;Telugu;Cinema;Box officeసందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ టైటిల్... ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ టైటిల్... ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!Sk{#}atreya;sandeep;sundeep kishan;V I Anand;Heroine;Posters;Telugu;Cinema;Box officeSat, 30 Mar 2024 23:40:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఈయన నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నప్పటికీ ఈయన ఎప్పుడు రొటీన్ సినిమాలలో నటించకుండా వైవిధ్యమైన కథాంశాలతో రూపొందిన సినిమాలలో నటిస్తూ రావడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సందీప్ ఆఖరుగా ఊరి పేరు భైరవకోన అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా ... వర్షా బొల్లమ్మ , కావ్య దాపరి మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా సందీప్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. సందీప్ తన తదుపరి మూవీ ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి స్వరూప్ ఆర్ ఎస్ జీ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

మూవీ కి "వైబ్" అనే టైటిల్ ను ఈ మూవీ బృందం ఖరారు చేస్తూ అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో సందీప్ కిషన్ తో పాటు మరి కొంత మంది ఉన్నారు. ఇకపోతే ఈ మూవీ ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు రూపొందించనుండగా ... ఈ మూవీ న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>