MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daniyal-balaji95206ba2-2589-4073-b154-20e1e22102c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daniyal-balaji95206ba2-2589-4073-b154-20e1e22102c1-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్దరాత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుతపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమdaniyal balaji{#}Tuck Jagdish;Tuck Jagadish;Kannada;Romantic;Athadu;Amarnath K Menon;Kollywood;Venkatesh;daniel balaji;Sri Venkateswara swamy;Friday;naga;Nani;Telugu;Tollywood;Jr NTR;March;Directorడేనియల్ బాలాజీ మరణానంతరం.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడుడేనియల్ బాలాజీ మరణానంతరం.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడుdaniyal balaji{#}Tuck Jagdish;Tuck Jagadish;Kannada;Romantic;Athadu;Amarnath K Menon;Kollywood;Venkatesh;daniel balaji;Sri Venkateswara swamy;Friday;naga;Nani;Telugu;Tollywood;Jr NTR;March;DirectorSat, 30 Mar 2024 13:00:00 GMT కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్దరాత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుతపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.

డేనియల్ బాలాజీ మరణాంతరం కూడా గొప్ప మనసు చాటుకున్నారు. తాను చనిపోయినా కూడా ఓ రెండు జీవితాలను బ్రతికించాడు. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్‌ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలను కున్నాడని కుటుంబీకులు చెప్పారు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.

2001లో చితి సీరియల్‏తో బుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఇందులో డేనియల్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా, ఫ్రాధు ఫ్రాదు చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కీలకపాత్రలలో నటించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>