MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybd0b3d43-9002-4192-bf0b-5838c0f67356-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneybd0b3d43-9002-4192-bf0b-5838c0f67356-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేల పలు రకాల పథకాలతో సబ్సిడీలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా చేస్తోంది.. ఇందులో భాగంగానే ఎంతో మంది ఆధారపడినటువంటి ఉపాధి హామీ పథకం మీద పని చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలకు సగటు 4 నుంచి 10 శాతం మేరకు వేతనాలను పెంచినట్లుగా తెలియజేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వేతనాల పెంపును ప్రతిపాదించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రాగానే ఉపాధి వేతనాలను సవరించి మార్MONEY{#}Good news;central government;Punjab;Good Newwz;Telangana;Telugu;March;Governmentమనీ: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. వేతనం పెంపు..!!మనీ: ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్.. వేతనం పెంపు..!!MONEY{#}Good news;central government;Punjab;Good Newwz;Telangana;Telugu;March;GovernmentFri, 29 Mar 2024 11:21:17 GMTకేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేల పలు రకాల పథకాలతో సబ్సిడీలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా చేస్తోంది.. ఇందులో భాగంగానే ఎంతో మంది ఆధారపడినటువంటి ఉపాధి హామీ పథకం మీద పని చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలకు సగటు 4 నుంచి 10 శాతం మేరకు వేతనాలను పెంచినట్లుగా తెలియజేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వేతనాల పెంపును ప్రతిపాదించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఎన్నికల సంఘం నుంచి క్లియరెన్స్ రాగానే ఉపాధి వేతనాలను సవరించి మార్చి 27 నుంచి పెంచేలా ప్లాన్ చేస్తున్నారట.


అత్యధికంగా హర్యానాలో రోజుకి రూ.374 రూపాయలు చొప్పున వేతనం ఇస్తున్నారు.. ఇక నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో రోజుకి రూ.234 రూపాయలు అందిస్తున్నారు. అలాగే సిక్కిం లోని మూడు పంచాయితీలలో రూ.374 రూపాయలు చొప్పున అందిస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాలలో విషయానికి వస్తే తెలంగాణలో రోజు వారి కూలి 300 రూపాయలు ఉన్నది..2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 272 గా ఉన్నది.. అయితే ఈ పెంచిన మొత్తం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతోందట.

గోవాలో వేతన పెంపు రేటు అత్యధికంగా 34 రూపాయలను పెంచారట.. ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు రోజువారి వేతనం కేంద్ర ప్రభుత్వం రూ.272 రూపాయలు అమలు చేయగా ఇప్పుడు అదనంగా మరొక 28 రూపాయలు జోడించి మొత్తం 300 రూపాయలను ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలలో కూడా 300 రూపాయలు కాబోతున్నట్లు తెలుస్తోంది. కేరళలో 346 రూపాయలు.. కర్ణాటకలో 349.. తమిళనాడులో 319 రూపాయలు.. గోవాలో 356.. పంజాబ్ లో 322 రూపాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఉపాధి కూలీలు సైతం కాస్త ఆనందాన్ని తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>