PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/s-raghurama-contest-fix-three-parties-green-signal0dffb73c-ff0c-4f11-99bf-5877b4088e44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/s-raghurama-contest-fix-three-parties-green-signal0dffb73c-ff0c-4f11-99bf-5877b4088e44-415x250-IndiaHerald.jpgవైసీపీ రెబ‌ల్ ఎంపీగా నాలుగేళ్ల పాటు అధికార పార్టీని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు. ర‌ఘురామ 2014 ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. అయితే చివ‌ర్లో జ‌గ‌న్‌తో ఎక్క‌డ గొడ‌వ త‌లెత్తిందో తెలియ‌దు కాని ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. న‌ర‌సాపురం టీడీపీ పార్ల‌మెంటు ఇన్‌చార్జ్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు. చందAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jenasena; pawan kalyan; modi; chandrababu{#}media;MP;Bharatiya Janata Party;YCP;Telugu Desam Party;TDP;Partyఎస్ ర‌ఘురామ పోటీ ఫిక్స్‌... మూడు పార్టీలు గ్రీన్‌సిగ్న‌ల్‌...?ఎస్ ర‌ఘురామ పోటీ ఫిక్స్‌... మూడు పార్టీలు గ్రీన్‌సిగ్న‌ల్‌...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jenasena; pawan kalyan; modi; chandrababu{#}media;MP;Bharatiya Janata Party;YCP;Telugu Desam Party;TDP;PartyFri, 29 Mar 2024 17:36:07 GMTవైసీపీ రెబ‌ల్ ఎంపీగా నాలుగేళ్ల పాటు అధికార పార్టీని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఆ పార్టీ న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు. ర‌ఘురామ 2014 ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. అయితే చివ‌ర్లో జ‌గ‌న్‌తో ఎక్క‌డ గొడ‌వ త‌లెత్తిందో తెలియ‌దు కాని ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కే బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. న‌ర‌సాపురం టీడీపీ పార్ల‌మెంటు ఇన్‌చార్జ్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

చంద్ర‌బాబు ఎంపీ టిక్కెట్ ఇవ్వ‌డంలో ఆల‌స్యం చేయ‌డంతో మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. అంత వేవ్ లోనూ వైసీపీ నుంచి కేవ‌లం 26 వేల ఓట్ల తేడాతో మాత్ర‌మే గెలిచి ఫ‌స్ట్ టైం పార్ల‌మెంటుకు ఎన్నికై ఎంపీ అవ్వాల‌న్న త‌న కోరిక నెర‌వేర్చుకున్నారు. ఆ వెంట‌నే ఎంపీ అయిన యేడాదికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ట్ల విబేధించ‌డం ప్రారంభించారు. ఢిల్లీలోనే ఉంటూ క్ర‌మ‌క్ర‌మంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై ర‌చ్చ బండ పేరుతో ర‌చ్చ చేస్తూ వీడియోలు వ‌దులుతూ సోష‌ల్ మీడియా, మీడియా చ‌ర్చ‌ల్లో బాగా పాపుల‌ర్ అయిపోయారు.

ఈ సారి కూట‌మిలో భాగంగా ఆయ‌న జ‌న‌సేన లేదా బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీల‌లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తార‌నే అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న కోరుకున్న న‌ర‌సాపురం సీటు బీజేపీ తీసుకుని ర‌ఘురామ‌కు కాకుండా శ్రీనివాస వ‌ర్మ‌కు ఇచ్చింది. దీంతో ర‌ఘురామ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌కు చంద్ర‌బాబు నాయుడు అన్యాయం చేయ‌రంటూనే తానే న‌ర‌సాపురం నుంచి పోటీ చేస్తాన‌ని చెపుతూ వ‌స్తున్నారు.

అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిన‌ట్టు తెలుస్తోంది. ర‌ఘురామ‌ను ఎలాగైనా పోటీ చేయించాల‌ని కూట‌మిలోని మూడు పార్టీల నేత‌లు, నాయ‌కులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే ఆయ‌న‌కు ఏ సీటు ఇస్తారు ?  ఎక్క‌డ నుంచి ఇస్తారు ? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గా మారింది. అయితే ఆయ‌న్ను పార్లమెంటుకు పోటీ చేయిస్తారా లేదా అసెంబ్లీకి పోటీ చేయిస్తారా ? అన్న‌ది చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>