Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanrhd4c2464e-2b5e-47fa-bf3a-e729ab1ac4c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanrhd4c2464e-2b5e-47fa-bf3a-e729ab1ac4c9-415x250-IndiaHerald.jpgనీ వంతు అయిపోయింది. ఇక ఇప్పుడు నా వంతు అన్న లెక్కలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ తీరు మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు.. మరోవైపు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం.. ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కట్టిన కట్టడాలలో పగుళ్లు రావడం ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇలా అన్న చుట్టుముట్టడంతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చూడని ఇబ్బందికర పరిస్థితులను చూస్తోంది. ఇలాంటి సమయంలో గులాబీ బాస్ కెసిఆర్ సైలెంట్ గా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక ఇRevanrh{#}revanth;Revanth Reddy;Arrest;Government;Assembly;kavitha;KCR;Congress;Party;Smart phoneకాంగ్రెస్ : రేవంత్ ఆ పని చేస్తే.. మొదటికే మోసం వస్తుందా?కాంగ్రెస్ : రేవంత్ ఆ పని చేస్తే.. మొదటికే మోసం వస్తుందా?Revanrh{#}revanth;Revanth Reddy;Arrest;Government;Assembly;kavitha;KCR;Congress;Party;Smart phoneFri, 29 Mar 2024 15:15:00 GMTనీ వంతు అయిపోయింది. ఇక ఇప్పుడు నా వంతు అన్న లెక్కలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ తీరు మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు.. మరోవైపు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం.. ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కట్టిన కట్టడాలలో పగుళ్లు రావడం ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇలా అన్న చుట్టుముట్టడంతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చూడని ఇబ్బందికర పరిస్థితులను చూస్తోంది.


 ఇలాంటి సమయంలో గులాబీ బాస్ కెసిఆర్ సైలెంట్ గా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక ఇలాంటి సమయంలోనే రేవంత్ గేట్లు ఎత్తడంతో ఇక మొన్నటి వరకు బిఆర్ఎస్ లో కీలక నేతలుగా పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వారు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకరకంగా బాహుబలిలో కట్టప్పల కెసిఆర్ ను దెబ్బ కొడుతున్నారు మొన్నటి వరకు నమ్మిన బంటులా ఉన్న నాయకులు. అయితే అటు రేవంత్ రెడ్డి సైతం ఉత్సాహంతో ఇక తమ పార్టీలోకి వస్తానన్న నేతలు అందరికీ కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా కండువా కప్పేస్తూ ఉన్నారు.


 కానీ రేవంత్ కాస్త అత్యుత్సాహ పడితే మాత్రం పార్టీకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రతిపక్షం అనేది లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. కెసిఆర్ వ్యవహార శైలి కాంగ్రెస్లో ప్రజలకు సింపతి వచ్చేలా చేసింది. ఇక రేవంత్ కూడా కాస్త ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శించి అందరిని పార్టీలోకి లాగేసుకుంటే ఇక బిఆర్ఎస్ పై ప్రజలలో సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు పార్టీ ఓవర్ లోడ్ అయిన కూడా.. ప్రమాదమే అప్పటికే కాంగ్రెస్లో ఉన్న నేతలకు ఇక కొత్తగా కాంగ్రెస్ లో వచ్చిన నాయకులకు మధ్య సమన్వయ లోపం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది.  అందుకే ఓవర్ లోడింగ్ విషయంలో కూడా రేవంత్వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>