PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-mla-ycp-tdp-jagan90557562-df77-41ef-9dd7-d48a7fa10577-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-mla-ycp-tdp-jagan90557562-df77-41ef-9dd7-d48a7fa10577-415x250-IndiaHerald.jpgఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల వేళ జంపింగ్ జ‌పాంగ్‌ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి క‌ప్ప‌దాట్లు స్వింగ్‌లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఓ నేత కూడా ఈ రోజు లోకేష్ స‌మ‌క్షంలో టీడీపీలోకి జంప్ చేయ‌డం విశేషం. ఆ నేత ఎవ‌రో కాదు చిల‌క‌లూరిపేట‌లో గ‌త ప‌ది రోజుల వ‌ర‌కు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉన్న మ‌ల్లేల రాజేష్ నాయుడు. మ‌ల్లేల రాజేష్ నాయుడు 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLA; ycp; tdp; jagan{#}Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Chilakaluripeta;Minister;Guntur;Hanu Raghavapudi;MLA;YCP;Telugu Desam Party;TDP;Partyజ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇచ్చినా దండం పెట్టేసి టీడీపీలోకి జంప్ చేసిన వైసీపీ లీడ‌ర్‌..!జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇచ్చినా దండం పెట్టేసి టీడీపీలోకి జంప్ చేసిన వైసీపీ లీడ‌ర్‌..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLA; ycp; tdp; jagan{#}Lokesh;Nara Lokesh;Lokesh Kanagaraj;Chilakaluripeta;Minister;Guntur;Hanu Raghavapudi;MLA;YCP;Telugu Desam Party;TDP;PartyFri, 29 Mar 2024 17:41:34 GMTఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల వేళ జంపింగ్ జ‌పాంగ్‌ల జోరు మామూలుగా లేదు. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి క‌ప్ప‌దాట్లు స్వింగ్‌లో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఓ నేత కూడా ఈ రోజు లోకేష్ స‌మ‌క్షంలో టీడీపీలోకి జంప్ చేయ‌డం విశేషం. ఆ నేత ఎవ‌రో కాదు చిల‌క‌లూరిపేట‌లో గ‌త ప‌ది రోజుల వ‌ర‌కు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉండి.. వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉన్న మ‌ల్లేల రాజేష్ నాయుడు.

మ‌ల్లేల రాజేష్ నాయుడు 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు చిల‌క‌లూరిపేట ఏఎంసీ చైర్మ‌న్ గా కూడా వ్య‌వ‌హ‌రించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న వైసీపీ కండువా క‌ప్పుకున్నా ఆయ‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వంలో ఒరిగిందేమి లేదు. ఇక విడ‌ద‌ల ర‌జ‌నీ మంత్రి ప‌ద‌వి వ‌చ్చాక కూడా రాజేష్ నాయుడికి ఆ ప‌ద‌వి ఈ ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి ఇవ్వలేదు.

ఆమెను జ‌గ‌న్ గుంటూరు వెస్ట్ సీటుకు మార్చాక రాజేష్ నాయుడికి చిల‌క‌లూరిపేట ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. ఆయ‌నే అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే క్యాండెట్ అనుకున్నారు. అయితే ర‌జ‌నీ రాజేష్‌కు సీటు ఇప్పించేందుకు రు 6.5 కోట్లు తీసుకున్న‌ట్టు కూడా ఆయ‌న ఆరోపించారు. క‌ట్ చేస్తే రెండు నెల‌లు కూడా కాకుండానే ర‌జ‌నీపై, స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన రాజేష్ నాయుడు ని ఇన్‌చార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు.

తాజాగా ఈ రోజు ఆయ‌న వైసీపీ లోని ముఖ్య నాయకులతో  తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌గ‌న్ సీటు ఇవ్వ‌గానే ఉత్సాహంగా పోటీ చేద్దామనుకున్న మల్లెల రాజేష్ నాయుడుకు గ్రౌండ్ రియాలిటీ అర్థం అయ్యింద‌ని.. అందుకే ఆయ‌న సీటు వ‌ద్ద‌నే ఇప్పుడు టీడీపీలో జంప్ చేశార‌ని అంటున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆయ‌న తెలుగుదేశం పార్టీ లో చేరారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>