Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu5a6a6a1b-0094-4ea7-8d19-027f2ed9f29f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu5a6a6a1b-0094-4ea7-8d19-027f2ed9f29f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు సాగుతున్న టిడిపి.. అటు అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. పార్టీలో ఉన్న మిగతా నేతల నుంచి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైనల్ అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించేశారు. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్సభ స్థానాల నుంచి టిడిపి బరిలోకి దిగుతుంది. అయితే 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు నాలుగు స్థానాChandrababu{#}Ananthapuram;Paderu;Bheemili;Guntakal;Rajampet;Alur;Loksabha;kadapa;Vijayanagaram;Vizianagaram;Kadiri;Assembly;CBN;TDP;Bharatiya Janata Party;MP;prasadఏపీ : ఫైనల్ లిస్ట్ ప్రకటించేసిన చంద్రబాబు.. డీటెయిల్స్ ఇవే?ఏపీ : ఫైనల్ లిస్ట్ ప్రకటించేసిన చంద్రబాబు.. డీటెయిల్స్ ఇవే?Chandrababu{#}Ananthapuram;Paderu;Bheemili;Guntakal;Rajampet;Alur;Loksabha;kadapa;Vijayanagaram;Vizianagaram;Kadiri;Assembly;CBN;TDP;Bharatiya Janata Party;MP;prasadFri, 29 Mar 2024 14:44:41 GMTప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు సాగుతున్న టిడిపి.. అటు అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎంతో వ్యూహాత్మకం గా వ్యవహరిస్తుంది. పార్టీలో ఉన్న మిగతా నేతల నుంచి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఈ క్రమం లోనే ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫైనల్ అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించేశారు. పొత్తు లో భాగంగా 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్సభ స్థానాల నుంచి టిడిపి బరిలోకి దిగుతుంది.



 అయితే 9 మంది అసెంబ్లీ అభ్యర్థుల తో పాటు నాలుగు స్థానాలకు గాని ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడాన్ని కాస్త హోల్డ్ లో పెట్టింది టిడిపి. ఇక తమకే టికెట్ వస్తుందని ఎంతో మంది ఎదురుచూడగా.. ఇటీవల ఫైనల్ జాబితాను ప్రకటించి ఒక క్లారిటీ ఇచ్చింది అని చెప్పాలి. ఇక టికెట్ కోసం ఎదురు చూస్తున్న కొంత మంది సీనియర్లకు ఈ జాబితా లో చోటు కల్పించడం గమనార్హం. అయితే కదిరే అభ్యర్థిని మాత్రం టిడిపి మార్చింది. కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ఇక ప్రసాద్ కే సీటును కేటాయించింది.


టీడీపీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు
1. విజయనగరం – అప్పలనాయుడు
2. ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
3. అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
4. కడప – చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు.. పోటీ చేసే స్థానాలు
1. చీపురుపల్లి – కళా వెంకట్రావు
2. భీమిలి – గంటా శ్రీనివాసరావు
3. పాడేరు – వెంకటరమేష్‌ నాయుడు
4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
5. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
6. ఆలూరు – వీరభద్ర గౌడ్‌
7. గుంతకల్లు – గుమ్మనూరు జయరాం
8. అనంతపురం అర్బన్‌ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌
9. కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌ పేర్లను ప్రకటించింది టిడిపి అధిష్టానం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>