Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/odipoyenduke-peddayana-akkada-f7e47efc-2217-44ae-b5e0-fed53936367d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/odipoyenduke-peddayana-akkada-f7e47efc-2217-44ae-b5e0-fed53936367d-415x250-IndiaHerald.jpgఒకప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ ఎన్నికలు వచ్చినా పోటీ చేసేందుకు అభ్యర్థులు కాస్త ఎక్కువగానే ఉండేవారు. అయితే ఎన్నికల్లో అందరికీ ఛాన్స్ ఇవ్వలేము కదా.. అందుకే ఇక గులాబీ దళపతి కేసీఆర్ ఎవరో ఒకరికి మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. దీంతో టికెట్ తమకే వస్తుందని ఆశపడిన వారు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇక వారిని సర్ది చెప్పేందుకు అటు గులాబీ బాస్ తెగ కష్టపడేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఉన్న ఆప్షన్లలో ఎవరిని ఎంపిక చేయాలో అని ఆలోచించే పరిస్థితి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా నిలబెKcr.{#}Mudiraj;Backward Classes;Yevaru;Joseph Vijay;Dalapathi;KCR;District;Reddy;Parliment;Elections;Party;Telangana;Assemblyకేసీఆర్ : ఓడిపోయేందుకే.. పెద్దాయన అక్కడ అభ్యర్థిని నిలబెట్టాడా?కేసీఆర్ : ఓడిపోయేందుకే.. పెద్దాయన అక్కడ అభ్యర్థిని నిలబెట్టాడా?Kcr.{#}Mudiraj;Backward Classes;Yevaru;Joseph Vijay;Dalapathi;KCR;District;Reddy;Parliment;Elections;Party;Telangana;AssemblyFri, 29 Mar 2024 10:00:00 GMTఒకప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉండగా.. ఏ ఎన్నికలు వచ్చినా పోటీ చేసేందుకు అభ్యర్థులు కాస్త ఎక్కువగానే ఉండేవారు. అయితే ఎన్నికల్లో అందరికీ ఛాన్స్ ఇవ్వలేము కదా.. అందుకే ఇక గులాబీ దళపతి కేసీఆర్ ఎవరో ఒకరికి మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. దీంతో టికెట్ తమకే వస్తుందని ఆశపడిన వారు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇక వారిని సర్ది చెప్పేందుకు అటు గులాబీ బాస్ తెగ కష్టపడేవాడు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఉన్న ఆప్షన్లలో ఎవరిని ఎంపిక చేయాలో అని ఆలోచించే పరిస్థితి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడానికి ఎవరు దొరుకుతారా అని వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది.


 ఒకప్పుడు గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపిన కేసీఆర్ ఇక ఇప్పుడు ఓడిపోతామని తెలిసినా కొంతమందికి ఇక టికెట్లు ఇస్తూ ఛాన్సులు ఇస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీని వీడుతుండగా కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచే వాళ్ళని కేసీఆర్ నిలబెడతాడు అనుకుంటే.. కనీసం ప్రత్యర్ధుల ఓట్లు కూడా చీల్చలేని  అభ్యర్థులకు టికెట్లు వస్తూ ఉండడం గమనార్హం. మరి ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక విషయంలో బీసీలకే పెద్ద పీఠం వేశామని కేసీఆర్ చెబుతున్నారు. ఇదే విషయంపై బిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు.


 కానీ వాస్తవానికి మాత్రం బీసీలకు ఛాన్స్ ఇచ్చినచోట పరిస్థితి మరోలా ఉంది. గెలిచే అవకాశం లేని చోట కెసిఆర్ బీసీలను నిలబెడుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాలలో జరుగుతుంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఎప్పుడు అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఛాన్స్ ఇచ్చేవారు కేసీఆర్.  కానీ ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి అవకాశం ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన ఇక టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే ఆయన గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇక పని చేశారు  ఇక ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోతూనే వచ్చారు. ఇక ఇప్పుడు మిగతా పార్టీల అభ్యర్థులతో పోల్చి చూస్తే.. పట్టు తక్కువగా ఉన్న నేత కాసాని జ్ఞానేశ్వర్. దీంతో ఓడిపోతామని తెలిసినా కెసిఆర్ కాసాని జ్ఞానేశ్వర్ కు ఛాన్స్ ఇచ్చారంటూ  రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>