PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babubac3a439-17a7-427c-bdfd-30833cd61100-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandra-babubac3a439-17a7-427c-bdfd-30833cd61100-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభలను నిర్వహిస్తూ వారి పార్టీకి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజగలం సభలో వైసీపీ పాలనపై ఆయన పెchandra babu{#}Rayalaseema;Y S Vivekananda Reddy;Kadiri;Hanu Raghavapudi;bus;Telangana Chief Minister;Elections;Murder.;CBN;Jagan;politics;YCP;Andhra Pradesh;TDP;editor mohanచంద్ర‌బాబు:జగన్ ను ముందు చెల్లెలి ప్రశ్నలకు సమాధానం ఇవ్వమంటున్న ప్రతిపక్షనేత.!చంద్ర‌బాబు:జగన్ ను ముందు చెల్లెలి ప్రశ్నలకు సమాధానం ఇవ్వమంటున్న ప్రతిపక్షనేత.!chandra babu{#}Rayalaseema;Y S Vivekananda Reddy;Kadiri;Hanu Raghavapudi;bus;Telangana Chief Minister;Elections;Murder.;CBN;Jagan;politics;YCP;Andhra Pradesh;TDP;editor mohanFri, 29 Mar 2024 14:03:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభలను నిర్వహిస్తూ వారి పార్టీకి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజగలం సభలో వైసీపీ పాలనపై ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.


ఇందులో భాగంగా వివేకానంద రెడ్డిని ఎవరు, ఎందుకు, ఎలా చంపారన్న విషయానికి ప్రజలే సాక్ష్యం అని చంద్రబాబు నాయుడు అన్నారు. చిన్నాన అంటే తండ్రితో సమానమని.. బంధాలు, బాంధత్వాలు అంటే  జగన్ కు అర్థం తెలుసునా అంటూ ఆయన సభ ముఖంగా ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని తెలియజేశారు. ఇక రాయలసీమలో భాగంగా మొత్తం 52 సీట్లు ఉంటే అందులో 49 సీట్లలో వైసీపీని గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో జగన్ ప్రజల వద్దకు వెళ్లి ముద్దులు పెడుతూ.. బుగ్గలు నెమరుతూ రాయలసీమ ప్రజల కోసం ఏమేమో చేశానని చెబుతున్న ప్రజలకు చేసింది మాత్రం సున్నానే అని ఆయన తెలిపాడు.


ఇక అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె, జగన్ రెడ్డి చెల్లెలైన సునీత ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము జగన్ కు లేదంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు. చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు హత్య రాజకీయాలని ప్రోత్సహించరని.., పరదాల చాటున బస్సు యాత్రలు చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్టు నటిస్తున్న వారిని ప్రజలు ఎన్నుకోరని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>