PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalsima-tdp-kutamidcb5766a-296e-48cf-bfdb-5af193ee1c80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalsima-tdp-kutamidcb5766a-296e-48cf-bfdb-5af193ee1c80-415x250-IndiaHerald.jpg2024 ఎన్నికలలో భాగంగా టిడిపి, జనసేన ,బిజెపి కలిసి కూటమితో పోటీ చేయబోతున్నాయి.. ఇందులో భాగంగానే సీట్ల విషయంలో కూడా అండర్స్టాండింగ్ తోనే అభ్యర్థులను నిలబెడుతున్నారు. కానీ సీనియర్ నేతలకు , పార్టీలో ఎంతో కాలంగా ఉన్నటువంటి వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో అటు టిడిపి జనసేన లో కూడా వర్గ పోరు మొదలయ్యింది.. తాజాగా ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమలో ధర్మవరం టికెట్ పైన కూటమిలో చిచ్చురేగినట్టుగా తెలుస్తోంది.. టికెట్ తమకే కావాలని మూడు పార్టీ నేతలు కూడా రోడ్ ఎక్కారు.. అంతేకాకుండా ఒకరికి టికెRAYALSIMA;TDP;KUTAMI{#}satya;sriram;Bharatiya Janata Party;Janasena;MLA;Heart;Dharmavaram;TDP;paritala ravindra;Kathanam;News;Indian;Partyరాయలసీమ: పొత్తే టీడీపీకి శాపంగా మారనుందా..?రాయలసీమ: పొత్తే టీడీపీకి శాపంగా మారనుందా..?RAYALSIMA;TDP;KUTAMI{#}satya;sriram;Bharatiya Janata Party;Janasena;MLA;Heart;Dharmavaram;TDP;paritala ravindra;Kathanam;News;Indian;PartyFri, 29 Mar 2024 08:00:00 GMT2024 ఎన్నికలలో భాగంగా టిడిపి, జనసేన ,బిజెపి కలిసి కూటమితో పోటీ చేయబోతున్నాయి.. ఇందులో భాగంగానే సీట్ల విషయంలో కూడా అండర్స్టాండింగ్ తోనే అభ్యర్థులను నిలబెడుతున్నారు. కానీ సీనియర్ నేతలకు , పార్టీలో ఎంతో కాలంగా ఉన్నటువంటి వారికి  టికెట్లు ఇవ్వకపోవడంతో అటు టిడిపి జనసేన లో కూడా వర్గ పోరు మొదలయ్యింది.. తాజాగా ఇండియన్ హెరాల్డ్ కు అందుతున్న సమాచారం ప్రకారం రాయలసీమలో ధర్మవరం టికెట్ పైన కూటమిలో చిచ్చురేగినట్టుగా తెలుస్తోంది.. టికెట్ తమకే కావాలని మూడు పార్టీ నేతలు కూడా రోడ్ ఎక్కారు.. అంతేకాకుండా ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించమంటూ తెలుపుతున్నారు.


ఇండియన్ హెరాల్డ్ అందిస్తున్న కథనం ప్రకారం.. అనూహ్యంగా జిల్లాకు సంబంధం లేకుండా ధర్మవరం టికెట్టును బిజెపి పార్టీకి చెందిన సత్య కుమారును ప్రకటించింది అధిష్టానం.. దీంతో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు రాజకీయాలలో హార్ట్ టాపిక్ గా మారుతున్నది. అంతేకాకుండా ధర్మవరం టిడిపి టికెట్ తరుపున పరిటాల శ్రీరామ్ కూడా ఆశించగా అతనికి కూడా నిరాశ మిగిలింది. అయితే అటు సూర్యనారాయణ, శ్రీరామ్ ఎవరో ఒకరికి టికెట్ వస్తుందని అనుకోగా ఇద్దరికీ మొండి చెయ్యి ఎదురయ్యింది.


ఇండియన్ హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం ప్రకారం.. సూర్యనారాయణ కూటమికి వ్యతిరేకంగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే 2009లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీపడి 42 వేలకు పైగా ఓట్లను చీల్చారు. 2012లో టిడిపిలోకి చేరి 2014లో టిడిపి తరఫున పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. 2019లో టిడిపి తరఫున ఓడిపోవడంతో బిజెపిలోకి చేరారు. అటు టిడిపి వర్గీయులు కూడా గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన పార్టీని ధర్మవరం ఇన్చార్జిగా తీసుకొని శ్రీరామ్ పైకి తెచ్చారని అతనికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.



ఇండియన్ హెరాల్డ్ తెలుపుతున్న సమాచారం మేరకు.. బిజెపికి ఏపీలో పట్టులేదని.. అంతేకాకుండా అక్కడ ధర్మవరం ప్రజలకు కూడా సత్య కుమార్ అనే వ్యక్తి కూడా తెలియకపోవడంతో ప్రజలు ఓటు వేయరనే విషయాన్ని గుర్తించాలంటూ అక్కడి నేతలు తెలియజేస్తున్నారు. మరి అధిష్టానం విషయం పైన ఎలా స్పందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>