BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/priyanka8b66c078-372a-4122-a4f4-5d07264b03a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/priyanka8b66c078-372a-4122-a4f4-5d07264b03a8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక నాలుగు సీట్లు మినహా అంతా పూర్తయింది. అయితే.. మొత్తం 17 సీట్లలో అత్యంత ఆసక్తిదాయకంగా ఖమ్మం నియోజకవర్గం మారింది. ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆమె ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ.. రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీచేయడానికి ప్రియాంక సుముఖంగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. దీనిపై ప్రియాంక ఇంకా ఏ విషయం తేల్చి చెప్పలేదpriyanka{#}priyanka;Vemuri Radhakrishna;Akkineni Nageswara Rao;Khammam;Congress;MP;Minister;Partyతెలంగాణ: ప్రియాంక కోసమే ఆ సీటు ఆపారా?తెలంగాణ: ప్రియాంక కోసమే ఆ సీటు ఆపారా?priyanka{#}priyanka;Vemuri Radhakrishna;Akkineni Nageswara Rao;Khammam;Congress;MP;Minister;PartyThu, 28 Mar 2024 07:18:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక నాలుగు సీట్లు మినహా అంతా పూర్తయింది. అయితే.. మొత్తం 17 సీట్లలో అత్యంత ఆసక్తిదాయకంగా ఖమ్మం నియోజకవర్గం మారింది. ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నేతలు గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆమె ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ..  రెండో స్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీచేయడానికి ప్రియాంక సుముఖంగా ఉన్నారని కొందరు చెబుతున్నారు. దీనిపై ప్రియాంక ఇంకా ఏ విషయం తేల్చి చెప్పలేదు.


అందుకే ప్రియాంక నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్‌లో పెట్టింది. అయితే ఈ స్థానానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్‌ ఇప్పటికే బరిలో ఉన్నారు. వ్యాపారవేత్త వీవీ రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకృష్ణ బరిలో ఉన్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>