Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbndc3be27e-80d2-42a2-ac09-b100ccb5e761-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbndc3be27e-80d2-42a2-ac09-b100ccb5e761-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బీజేపీ పార్టీని తన స్వప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ వాడుకుంటూనే ఉన్నారు. నిజానికి ఏపీ బీజేపీ పార్టీ రెండు వర్గాలుగా ఉంటుంది. ఆ రెండు వర్గాల్లో ఒక వర్గం చంద్రబాబు నాయుడు కోవర్టుల వర్గం అని చెప్పుకోవచ్చు. ఈ వర్గం నేతలకు బీజేపీలో చేరడం అసలు ఇష్టం లేదు కానీ చంద్రబాబు బతిలాడి, బుజ్జగించి వారిని ఆ పార్టీలోకి వెళ్లేలా చేశారు. అనంతరం పార్టీ అంతర్గత రహస్యాలను తెలుసుకుంటూ స్వలాభం పొందుతున్నారు. బీజేపీలో ఉన్న ఈ నేతలు అనునిత్యం చంద్రబాబు భజన చేస్తుంటారు. ఇక భారతీయ జనతా పారCbn{#}editor mohan;Ishtam;TDP;Letter;Assembly;Andhra Pradesh;Telangana Chief Minister;CBN;Bharatiya Janata Party;Partyఏపీ: బాబు అంటే నచ్చనోళ్లు.. బీజేపీకి నచ్చలేదు?ఏపీ: బాబు అంటే నచ్చనోళ్లు.. బీజేపీకి నచ్చలేదు?Cbn{#}editor mohan;Ishtam;TDP;Letter;Assembly;Andhra Pradesh;Telangana Chief Minister;CBN;Bharatiya Janata Party;PartyThu, 28 Mar 2024 10:00:00 GMTమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ బీజేపీ పార్టీని తన స్వప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ వాడుకుంటూనే ఉన్నారు. నిజానికి ఏపీ బీజేపీ పార్టీ రెండు వర్గాలుగా ఉంటుంది. ఆ రెండు వర్గాల్లో ఒక వర్గం చంద్రబాబు నాయుడు కోవర్టుల వర్గం అని చెప్పుకోవచ్చు. ఈ వర్గం నేతలకు బీజేపీలో చేరడం అసలు ఇష్టం లేదు కానీ చంద్రబాబు బతిలాడి, బుజ్జగించి వారిని ఆ పార్టీలోకి వెళ్లేలా చేశారు. అనంతరం పార్టీ అంతర్గత రహస్యాలను తెలుసుకుంటూ స్వలాభం పొందుతున్నారు. బీజేపీలో ఉన్న ఈ నేతలు అనునిత్యం చంద్రబాబు భజన చేస్తుంటారు.

ఇక భారతీయ జనతా పార్టీలో ఉన్న మరో వర్గం నేతలు చంద్రబాబు అంటేనే చాలా డేంజర్ అని భయపడిపోతుంటారు. అతనితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరమే అని భావిస్తుంటారు. ఏ పార్టీ మైత్రి లేకుండా ఏపీలో స్వచ్ఛమైన బీజేపీ పార్టీ ఏర్పడాలనేదే ఈ వర్గం నేతల చిరకాల ఆశయం. వీరు ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి కూడా దూరంగా ఉంటారు. కానీ టీడీపీ పార్టీ వాళ్లు మాత్రం ఈ వర్గం నేతలు జగన్‌కి సానుభూతిపరులు, మద్దతు దారులు గ్లోబల్ లెవెల్ లో ప్రచారం చేస్తుంటారు.

అయితే బీజేపీ అధిష్టానం 2024 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కోవర్టులకు మాత్రమే టికెట్లు ఇచ్చింది. చంద్రబాబును వ్యతిరేకించే సీనియర్ నేతలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఇది చాలా ఏళ్లుగా ఆ పార్టీనే నమ్ముకొని వస్తున్న ఆ నేతలకు అతిపెద్ద అన్యాయం అని చెప్పుకోవచ్చు. నిజానికి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన బీజేపీకి ఇచ్చిన సీట్లలో ఒక్క సీటు కూడా టీడీపీ ఇప్పటిదాకా గెలవలేదు.

విష్ణువర్ధన్ రెడ్డి, శాంతరెడ్డి తదితరులు ఈ విషయాన్ని తెలియజేస్తూ బీజేపీ అధినేతలకు లేఖలు కూడా రాశారు కానీ కమలం పార్టీ అవేమీ పట్టించుకోకుండా టీడీపీ ఇచ్చిన సీట్లను ప్రసాదంగా స్వీకరించింది. చంద్రబాబుని వ్యతిరేకించే వారెవరికి సీట్లు ఇవ్వకుండా చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న నేతలకే సీట్లు అందజేసింది. ఇలా చూస్తుంటే చంద్రబాబును వ్యతిరేకించే వారిని బీజేపీ కూడా వ్యతిరేకిస్తోందని క్లియర్ గా అర్థమవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>