Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0eb38ccc-a4e0-477f-aae2-c03475b835d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr0eb38ccc-a4e0-477f-aae2-c03475b835d0-415x250-IndiaHerald.jpgఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని పార్టీలు ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గెలుపు గుర్రాలను బరులోకి దింపేందుకు ఇక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అంతిమ తీర్పు ఇచ్చేది మాత్రం ఓటర్లే. ఓటర్లు ఎప్పుడు ఎవరి తరపున నిలబడతారు అని ఊహించడం కూడా కష్టమే. సాధారణంగా ఎన్నికల సమయంలో సిట్టింగులకు ఛాన్సులు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఉండి ప్రజలకు ఆయా నాయకులు చేరువవుతూ ఉంటారు. ఇక తమ అభివృKcr{#}Mahabubabad;MLA;Dalapathi;Parliment;Joseph Vijay;MP;Assembly;Parliament;Congress;kavitha;Partyబిఆర్ఎస్ : కేసీఆర్.. ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదేమో?బిఆర్ఎస్ : కేసీఆర్.. ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదేమో?Kcr{#}Mahabubabad;MLA;Dalapathi;Parliment;Joseph Vijay;MP;Assembly;Parliament;Congress;kavitha;PartyWed, 27 Mar 2024 10:45:00 GMTఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని పార్టీలు ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. గెలుపు గుర్రాలను బరులోకి దింపేందుకు ఇక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అంతిమ తీర్పు ఇచ్చేది మాత్రం ఓటర్లే. ఓటర్లు ఎప్పుడు ఎవరి తరపున నిలబడతారు అని ఊహించడం కూడా కష్టమే. సాధారణంగా ఎన్నికల సమయంలో సిట్టింగులకు ఛాన్సులు ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


 ఎందుకంటే అప్పటికే ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఉండి ప్రజలకు ఆయా నాయకులు చేరువవుతూ ఉంటారు. ఇక తమ అభివృద్ధితో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎక్కువగా ఎన్నికల సమయంలో పార్టీలు సిట్టింగ్ లకే ఛాన్స్ ఇస్తూ ఉంటారు. అలా అని సిట్టింగ్లకు ఛాన్స్ ఇస్తే ప్రతిసారి కలిసి వస్తుందని చెప్పడం కూడా కష్టమే. కొన్ని కొన్ని సార్లు సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత పార్టీకి మైనస్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఓ పార్లమెంటు స్థానంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్నది తెలుస్తోంది.


 మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సెట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవితకే మరోసారి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే గులాబీ దళపతి కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత ఐదేళ్లలో మాలోత్ కవిత ఎంపీగా చేసిందేమీ లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గాలలో ఎంత పట్టు సాధించుకుందో అందరికీ తెలిసిన విషయమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాలలో కూడా భారీ తేడాతో విజయం సాధించింది కాంగ్రెస్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా. ఇలాంటి సమయంలో వ్యతిరేకత ఉన్న  సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను కాకుండా మరొకరికి ఛాన్స్ ఇచ్చిన టిఆర్ఎస్కు మహబూబాబాద్ లో గెలిచే అవకాశాలు ఉండేవని.. కానీ ఇప్పుడు పరిస్థితుల దృశ్య ఆ అవకాశాలు మరింత తగ్గిపోయాయని పార్టీ శ్రేణులు కూడా అనుకుంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>