EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddye370e93f-1230-45e9-aae6-c3e252a1c4b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddye370e93f-1230-45e9-aae6-c3e252a1c4b5-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఇవాళ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని 8లోక్‌సభ స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇవాళ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో 9మంది అభ్యర్ధుల్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్‌, మెదక్‌, భువనగిరి, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మంలో పోటీచేసే వారి పేర్లను పెండింగ్‌లో ఉంచింది. ఈ అభ్యర్థుల ఎంపిక కోసం అనేక సర్వేలు నిర్వహించారు. స్థానrevanth reddy{#}MLA;Lawyer;local language;Khammam;Reddy;Revanth Reddy;central government;Telangana Chief Minister;Minister;MP;Loksabha;Partyరేవంత్‌ రెడ్డి: లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదేనా?రేవంత్‌ రెడ్డి: లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదేనా?revanth reddy{#}MLA;Lawyer;local language;Khammam;Reddy;Revanth Reddy;central government;Telangana Chief Minister;Minister;MP;Loksabha;PartyWed, 27 Mar 2024 09:00:00 GMTరేవంత్ రెడ్డి తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఇవాళ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.  తెలంగాణలోని 8లోక్‌సభ స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇవాళ
ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో 9మంది అభ్యర్ధుల్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. హైదరాబాద్‌, మెదక్‌, భువనగిరి, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మంలో పోటీచేసే వారి పేర్లను  పెండింగ్‌లో ఉంచింది.


ఈ అభ్యర్థుల ఎంపిక కోసం అనేక సర్వేలు నిర్వహించారు. స్థానిక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థులపై చర్చించారు. దిల్లీలో ఇవాళ  కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగబోతోంది. దానికి హాజరయ్యే రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి జాబితా సమర్పించే అవకాశం ఉంది.


హైదరాబాద్‌ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్‌ను బరిలో దించే అవకాశం ఉంది. మెదక్‌లో నీలంమధు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు కనిపిస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బరిలో దించే అవకాశం ఉంది. బీసీకే ఇవ్వాలనుకుంటే పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ పేరు పరిశీలించవచ్చు. వరంగల్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు దాదాపు ఖరారైనట్టే. అయితే సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, పరంజ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయట.


ఇక కరీంనగర్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డికి అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారవేత్త రాజేందర్‌రావు పేరు కూడా బాగానే వినిపిస్తోంది. నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టే. ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ, డాక్టర్‌ సుమలతలలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు. ఇక కీలకమైన ఖమ్మం స్థానానికి పొంగులేటి ప్రసాద్‌రెడ్డి ముందువరుసలో ఉన్నా.. తుమ్మల తనయుడు యుగంధర్‌, భట్టి సతీమణి కూడా టికెట్‌ రేసులో ఉన్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>