PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఎలక్షన్ లు దగ్గర పడ్డాయి అంటే అంతకాలం పాటు పార్టీ కోసం పని చేసిన వారిలో ఎక్కువ శాతం మంది ఆ ఏరియాలో టికెట్లను ఆశిస్తూ ఉంటారు. దక్కని వారు ఆ సమయంలో క్రేజ్ ఉన్న వేరే పార్టీలోకి జంప్ కావడానికి కూడా చూస్తారు. అలా వేరే పార్టీలోకి వెళ్లి అయినా సరే టికెట్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది రాజకీయ నాయకులు అప్పటికప్పుడు ఉన్న పార్టీ నుండి పక్క పార్టీకి వెళుతూ ఉంటారు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ వైకాపా ఒంటరిగా పోటీ చJagan{#}Lakshmi Devi;Venkatagiri;Payakaraopeta;Nuziveedu;Sullurupeta;Rajampet;bus;Yatra;MLA;Assembly;Janasena;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;CM;Jagan;Partyజగన్ : టికెట్లు లేకపోయినా వైకాపాలోకి భారీ చేరికలు... అదే ప్రధాన కారణమా..?జగన్ : టికెట్లు లేకపోయినా వైకాపాలోకి భారీ చేరికలు... అదే ప్రధాన కారణమా..?Jagan{#}Lakshmi Devi;Venkatagiri;Payakaraopeta;Nuziveedu;Sullurupeta;Rajampet;bus;Yatra;MLA;Assembly;Janasena;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;CM;Jagan;PartyWed, 27 Mar 2024 15:57:20 GMTఎలక్షన్ లు దగ్గర పడ్డాయి అంటే అంతకాలం పాటు పార్టీ కోసం పని చేసిన వారిలో ఎక్కువ శాతం మంది ఆ ఏరియాలో టికెట్లను ఆశిస్తూ ఉంటారు. దక్కని వారు ఆ సమయంలో క్రేజ్ ఉన్న వేరే పార్టీలోకి జంప్ కావడానికి కూడా చూస్తారు. అలా వేరే పార్టీలోకి వెళ్లి అయినా సరే టికెట్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది రాజకీయ నాయకులు అప్పటికప్పుడు ఉన్న పార్టీ నుండి పక్క పార్టీకి వెళుతూ ఉంటారు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

అందులో భాగంగా ప్రస్తుత అధికార పార్టీ వైకాపా ఒంటరిగా పోటీ చేయనుండగా... టిడిపి , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తుగా పోటీ చేయబోతున్నాయి. ఇక ఇప్పటికే వైకాపా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ టికెట్లను అనౌన్స్ చేసింది. దాదాపుగా పార్టీ టికెట్లను అనౌన్స్ చేసిన తర్వాత వేరే పార్టీ సభ్యులు ఎవరూ కూడా ఆ పార్టీలోకి చేరారు. కాకపోతే వైకాపాలోకి మాత్రం పార్టీ టికెట్లను అనౌన్స్ చేసిన తర్వాత కూడా భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇతర పార్టీలో ఉన్న నేతలు ఓడిపోయే అవకాశం ఉండడం ఓడిపోయే వ్యక్తి పక్కన ఉండే కంటే గెలిచే వ్యక్తి పక్కన ఉంటే తర్వాత క్రేజ్ ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా ఈ పార్టీలోకి వచ్చి ఉండవచ్చు. ఇకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా " మేమంతా సిద్ధం" అంటూ జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టారు.  అయితే.. ఈ బస్సు యాత్రకు ఒక్క రోజు ముందు సీఎం క్యాప్ ఆఫీస్ కళకళలాడిపోయింది. ఇందులో భాగంగా ఏకంగా ఒకే రోజు 8 నియోజకవర్గాలకు చెందిన నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

వైసీపీలో చేరిన నేతల వివరాలు ఇలా ఉన్నాయి.  నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ఆయన కుమారుడు చిన్నం చైతన్య. పాయకరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి. టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ ఇన్ ఛార్జ్ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌. సూళ్ళూరుపేట టీడీపీ సీనియర్‌ నేత వేనాటి రామచంద్రారెడ్డి. వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్‌. రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ ఇన్ ఛార్జ్ గంటా నరహరి. జైభారత్‌ నేషనల్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు గొరకపూడి చిన్నయ్యదొర. విశాఖపట్నంకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు జి.వి.రవిరాజు , బొగ్గు శ్రీనివాస్, బొడ్డేటి అనురాధ (జనసేన నాయకులు) వైకాపా పార్టీలోకి జాయిన్ అయ్యారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>