Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections88b4a17e-52e4-4fd7-b4f7-9206a88f6070-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-elections88b4a17e-52e4-4fd7-b4f7-9206a88f6070-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఈ సారి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగనున్నాయి.. అధికార పార్టీ వైసీపీ మరియు బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి మధ్య పోటా పోటీ గా ఉండనుంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 175 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించి నేటి నుంచి ప్రచార హోరు కూడా మొదలు పెట్టింది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో వుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పెండింగ్ లో వున్నాయి. త్వరలోనే వాటి జాబితా కూడా వెలువర#assembly elections{#}Murder;Pinnelli Ramakrishna Reddy;Macherla;Elections;politics;Reddy;Andhra Pradesh;TDP;District;MLA;Janasena;YCP;Partyపల్నాడు : మాచర్ల నియోజకవర్గంలో ఈ సారి పై చేయి ఎవరిదంటే..?పల్నాడు : మాచర్ల నియోజకవర్గంలో ఈ సారి పై చేయి ఎవరిదంటే..?#assembly elections{#}Murder;Pinnelli Ramakrishna Reddy;Macherla;Elections;politics;Reddy;Andhra Pradesh;TDP;District;MLA;Janasena;YCP;PartyWed, 27 Mar 2024 18:11:45 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. ఈ సారి ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగనున్నాయి.. అధికార పార్టీ వైసీపీ మరియు టీడీపీ ఉమ్మడి కూటమి మధ్య పోటా పోటీ గా ఉండనుంది. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 175 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించి నేటి నుంచి ప్రచార హోరు కూడా మొదలు పెట్టింది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కూడా తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో వుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించగా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు పెండింగ్ లో వున్నాయి. త్వరలోనే వాటి జాబితా కూడా వెలువరించనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.. అందులోను పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి..అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గా గెలిచి రికార్డు సృష్టించారు..

2014,2019 వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.ఓటమిలేని నేతగా గుర్తింపు పొందిన పిన్నెల్లికి మొదటిసారి ఓటమి భయం మొదలు అయింది అని నియోజకవర్గం అంతా చర్చ జరుగుతుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా ఉండటం నియోజకవర్గంలో లాంటి అభివృద్ధి లేకపోవటంతో మొదటి సారి పిన్నెల్లికి ఎదురుగాలి వీస్తుంది. అవినీతి ఆరోపణలు హత్యా రాజకీయాలు, టోల్ గేట్, అక్రమ మైనింగ్ వంటి విషయాలు ఆయనకీ ప్రతికూలంగా మారుతున్నాయి.. అలాగే సొంత పార్టీ నేతలలోనే అసంతృప్తి ఉండటం మరో ప్రతికూల అంశంగా మారింది..ఇక టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వున్నారు.. ప్రస్తుతం ఈయన మాచర్ల నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు.. బ్రహ్మానందరెడ్డి గ్రాఫ్ గతంలో కంటే 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది.అక్కడి నియోజకవర్గం వర్గ ప్రజలు బ్రహ్మానందరెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జూలకంటినే పిన్నెల్లికి సరైన పోటీ అని ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>