MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoorb0723a65-09b3-47fc-91aa-c827032732a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoorb0723a65-09b3-47fc-91aa-c827032732a7-415x250-IndiaHerald.jpgటాప్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా వరుస సినిమాలను టాలీవుడ్‌ లో చేసేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో ట్రై చేసినా అక్కడ ఆమెకు అంత గుర్తింపు అయితే రాలేదు. అందుకే తన తల్లి గడ్డ అయిన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తుంది.ఇప్పటికే జాన్వీ ఎన్టీఆర్‌ తో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై జాన్వీ కపూర్‌ చాలా ఆశలు పెట్టుకుని ఫస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. అలాగే మరో వైపు రామ్‌ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో Janhvi Kapoor{#}Sridevi Kapoor;lord siva;Shiva;bollywood;Ram Charan Teja;Hero;Heroine;News;BEAUTY;Telugu;Tollywood;Cinemaఆ రెండు హిట్టయితే జాన్వీని ఇక ఆపలేరు?ఆ రెండు హిట్టయితే జాన్వీని ఇక ఆపలేరు?Janhvi Kapoor{#}Sridevi Kapoor;lord siva;Shiva;bollywood;Ram Charan Teja;Hero;Heroine;News;BEAUTY;Telugu;Tollywood;CinemaWed, 27 Mar 2024 14:32:59 GMTటాప్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా వరుస సినిమాలను టాలీవుడ్‌ లో చేసేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో ట్రై చేసినా అక్కడ ఆమెకు అంత గుర్తింపు అయితే రాలేదు. అందుకే తన తల్లి గడ్డ అయిన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తుంది.ఇప్పటికే జాన్వీ ఎన్టీఆర్‌ తో దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై జాన్వీ కపూర్‌ చాలా ఆశలు పెట్టుకుని ఫస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. అలాగే మరో వైపు రామ్‌ చరణ్ కు జోడీగా బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అందులో జాన్వీ కపూర్ పాల్గొనడం జరిగింది. తెలుగు లో రెండు సినిమాల్లో నటించడంతో పాటు మరో స్టార్‌ హీరో సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న జాన్వీ కపూర్ మళ్లీ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ తో కలిసి సెట్స్ లో అడుగు పెడతామా అంటూ ఎదురు చూస్తున్నట్లు ఆమె పేర్కొంది.


దేవరలో మళ్లీ తన పాత్ర షూటింగ్ కోసం ఇక ఏమాత్రం వేచి ఉండలేక పోతున్నాను అంటూ తన ఇన్‌ స్టాలో పేర్కొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ తో కలిసి జాన్వీ కపూర్‌ చేస్తున్న దేవర సినిమా అక్టోబర్ నెలలో విడుదల అవ్వబోతుంది. దేవర సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ అక్టోబర్‌ నెలలో విడుదల అవ్వనుండగా, రెండో పార్ట్‌ 2025 చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రామ్‌ చరణ్‌ తో జాన్వీ కపూర్‌ చేసే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ సమ్మర్‌ లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండు సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ ను అందమైన పల్లెటూరు అమ్మాయిగా చూడబోతున్నాం. హిందీలో ఇప్పటి దాకా దక్కని కమర్షియల్‌ హిట్‌ తెలుగు సినిమాలతో దక్కించుకుంటాను అనే నమ్మకంతో జాన్వీ కపూర్ కనిపిస్తుంది. తెలుగు లో నటిస్తూనే మరో వైపు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా ఈ హాట్ బ్యూటీ నటిస్తూ ఉంది.ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమాలు హిట్ అయితే జాన్వీ తన తల్లి శ్రీదేవి లాగే టాలీవుడ్ ఇండస్ట్రీని ఖాయం అంటున్నారు అభిమానులు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>