MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhima-movie-ott2e3fa20c-1d3d-42ab-8347-a82a035591e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhima-movie-ott2e3fa20c-1d3d-42ab-8347-a82a035591e7-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో విడుదలైన కొత్త సినిమాలు అన్నీ కూడా నెలలోపే ఓటీటి లో విడుదలవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా గోపీచంద్ నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం భీమా కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో గోపీచంద్ కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారని అభిమానులు తెలుపుతున్నారు. భీమా సినిమా ఓటీటి రైట్స్ ని ప్రముఖ ఓటీటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అత్యధిక ధరకు కొBHIMA;MOVIE;OTT{#}Priya;malavika new;Traffic police;Gopichand;News;Chitram;Kannada;Cinema;Telugu;Director;India;Successవావ్: ఓటిటిలోకి వచ్చేస్తున్న గోపీచంద్ భీమా..!!వావ్: ఓటిటిలోకి వచ్చేస్తున్న గోపీచంద్ భీమా..!!BHIMA;MOVIE;OTT{#}Priya;malavika new;Traffic police;Gopichand;News;Chitram;Kannada;Cinema;Telugu;Director;India;SuccessTue, 26 Mar 2024 22:00:00 GMTఈ మధ్యకాలంలో విడుదలైన కొత్త సినిమాలు అన్నీ కూడా నెలలోపే ఓటీటి లో విడుదలవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా గోపీచంద్ నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం భీమా కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో గోపీచంద్ కూడా మరొకసారి మంచి విజయాన్ని అందుకున్నారని అభిమానులు తెలుపుతున్నారు. భీమా సినిమా ఓటీటి రైట్స్ ని ప్రముఖ ఓటీటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అత్యధిక ధరకు కొనుగోలు చేసింది.


బీమా సినిమా ఏప్రిల్ 5న ఓటీటి లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషలలో స్ట్రిమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. ఓటిటి విషయం పైన ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మేకర్స్. భీమా చిత్రంలో  గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏ హర్ష టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తీశారు.


గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటించగా ఈ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నప్పటికీ మరి ఓటీటి లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి. చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన గోపీచంద్ కు భీమా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెమ్యూనరేషన్ ని కూడా గోపీచంద్ కాస్త తగ్గించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులైతే ప్రభాస్తో కలిసి మరొక సినిమాని తెరకెక్కించాలని కోరుకుంటున్నారు. అవకాశం వస్తే ఖచ్చితంగా మళ్ళీ నటిస్తానని కూడా గోపీచంద్ ఎన్నోసార్లు తెలియజేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>