Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karim-nagar-seetu-cm-ke-thalanoppi-techipettindeb13949f9-0d66-4f10-8f24-6975fdc3c663-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/karim-nagar-seetu-cm-ke-thalanoppi-techipettindeb13949f9-0d66-4f10-8f24-6975fdc3c663-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ పార్టీనా.. అధికారంలోకి వస్తుందా.. అదంతా పగటి కలే అని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోర్లు మూయించేలా తెలంగాణలో అఖండ విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. ఇక అదే జోరులో ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కలుపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న పెద్దలతో చర్చలు జరిపి గెలుపు గుర్రాలను పార్లమెంటు స్థానాలలో బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పటికే 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీRevanth{#}jeevan;Velama;Santhossh Jagarlapudi;Backward Classes;Karimnagar;revanth;Revanth Reddy;Congress;Reddy;local language;Parliament;Telangana;Parliment;MPరేవంత్ : కరీంనగర్ సీటు.. CM కే తలనొప్పి తెచ్చిపెట్టిందే?రేవంత్ : కరీంనగర్ సీటు.. CM కే తలనొప్పి తెచ్చిపెట్టిందే?Revanth{#}jeevan;Velama;Santhossh Jagarlapudi;Backward Classes;Karimnagar;revanth;Revanth Reddy;Congress;Reddy;local language;Parliament;Telangana;Parliment;MPTue, 26 Mar 2024 10:11:36 GMTకాంగ్రెస్ పార్టీనా.. అధికారంలోకి వస్తుందా.. అదంతా పగటి కలే అని విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోర్లు మూయించేలా  తెలంగాణలో అఖండ విజయాన్ని సాధించిన కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. ఇక అదే జోరులో ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో  విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కలుపుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న పెద్దలతో చర్చలు జరిపి గెలుపు గుర్రాలను పార్లమెంటు స్థానాలలో బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పటికే 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.


 దీంతో మిగిలిన పార్లమెంటు స్థానాలలో ఎవరికి కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే మిగతా పార్లమెంట్ స్థానాలలో టికెట్ కోసం పెద్దగా పోటీ లేకపోయినా.. అటు లోక్ సభ స్థానం విషయంలో ఎవరిని ఎంపిక చేయాలి అనే విషయంపై మల్ల గుల్లాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ముందుగా జీవన్ రెడ్డిని కరీంనగర్ బరిలో దింపాలని అనుకున్నప్పటికీ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. కుల సమీకరణాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగానే ఇక అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది అన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా.


 అయితే కరీంనగర్ ఎంపీ సీటు మాకే అంటూ ముగ్గురు నేతలు ఇక ఎంతో ధీమాతో ఉన్నారు. వెలిచాల రాజేందర్రావు, అల్గి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. బీసీ సామాజిక వర్గానికి చెందిన రుద్ర సంతోష్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే కరీంనగర్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటూ ఉండగా.. వెలమ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్రావు కి టికెట్ దక్కే ఛాన్సులు ఉన్నాయని మరి కొంతమంది అంచనా. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులు జాబితాలో వెలమ సామాజిక వర్గానికి ఎక్కడ సీట్ కేటాయించకపోవడంతో రాజేందర్ రావ్ కే టికెట్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా కరీంనగర్లో ఇప్పటివరకు పార్లమెంటు ఎన్నికల జరిగిన ప్రతిసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన నేతలే అక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఇలాక రీంనగర్ ఎంపీ టికెట్ కోసం ముగ్గురు ఆశావాహులు పోటీ పడుతుండగా అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఒకరికి సీటు కేటా ఇస్తే మిగతా ఆశావాహుల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ వ్యతిరేకత తగ్గాలంటే వారికి కూడా ఏదో ఒక పదవి ఆఫర్ చేయాల్సిందే. ఈ విషయంలో రేవంత్ ఎలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>