PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedటీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కాంగ్రెస్‌ పార్టీ కన్నేసింది. ఆయన పోటీ చేయాల‌ని భావించిన మైల‌వ‌రం టికెట్‌ను త‌న ప్ర‌త్య‌ర్థి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను పార్టీలోకి తీసుకుని మ‌రీ ఇచ్చేయ‌డం.. పోనీ.. వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇస్తామ‌న్న హామీని కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న అల‌క‌బూనారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. అవ‌స‌ర‌మైతే.. ఇండిపెండెం ట్‌గా అయినా పోటీ చేయాల‌ని భావించారు. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ పా్ర్టీ ఆయ‌న‌పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే దేవినేని ఉమాను పార్టీలోకి ఆహ్వానిసDevineni Uma Congress offer; Vasanth Krishna Prasad ticket; Congress party internal discussions; Chandrababu criticism on Devineni Uma; Devineni Uma discontent within Congress; Vasanth Krishna Prasad criticism; Devineni Uma switch to TDP; Congress party leadership discussions; Devineni Uma secret meeting with Congress leaders; Congress party senior leaders discontent{#}krishna;devineni avinash;Mylavaram;Devineni Uma Maheswara Rao;Telugu Desam Party;Sharmila;YCP;Minister;Congress;Partyఅమ‌రావ‌తి: కాంగ్రెస్‌లోకి దేవినేని ఉమా... గేమ్ మొద‌లైంది...!అమ‌రావ‌తి: కాంగ్రెస్‌లోకి దేవినేని ఉమా... గేమ్ మొద‌లైంది...!Devineni Uma Congress offer; Vasanth Krishna Prasad ticket; Congress party internal discussions; Chandrababu criticism on Devineni Uma; Devineni Uma discontent within Congress; Vasanth Krishna Prasad criticism; Devineni Uma switch to TDP; Congress party leadership discussions; Devineni Uma secret meeting with Congress leaders; Congress party senior leaders discontent{#}krishna;devineni avinash;Mylavaram;Devineni Uma Maheswara Rao;Telugu Desam Party;Sharmila;YCP;Minister;Congress;PartyTue, 26 Mar 2024 11:12:39 GMTటీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కాంగ్రెస్‌ పార్టీ కన్నేసింది. ఆయన పోటీ చేయాల‌ని భావించిన మైల‌వ‌రం టికెట్‌ను త‌న ప్ర‌త్య‌ర్థి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను పార్టీలోకి తీసుకుని మ‌రీ ఇచ్చేయ‌డం.. పోనీ.. వేరే నియోజ‌క‌వ‌ర్గం ఇస్తామ‌న్న హామీని కూడా చంద్ర‌బాబు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న అల‌క‌బూనారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. అవ‌స‌ర‌మైతే.. ఇండిపెండెం ట్‌గా అయినా పోటీ చేయాల‌ని భావించారు. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ పా్ర్టీ ఆయ‌న‌పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే  దేవినేని ఉమాను పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్టు తెలిసింది.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సూచన మేరకు కీలక నేతలు రంగంలోకి దిగి దేవినేనితో చర్చలు జరుపుతున్నట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న పార్టీలోకి చేరితే మైల‌వ‌రం టికెట్‌నే ఆయ‌న‌కు ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో దేవినేని స్పష్టత ఇచ్చే అవకాశముంది.  దేవినేని ఉమా టీడీపీలో సీనియర్‌ నేత. గత ప్రభుత్వ హయంలో మంత్రిగా కూడా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన దేవినేని తన ప్రత్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌పై ఓటమి చెందారు. ఓటమి పాలైనప్పటికీ రాజకీయంగా యాక్టివ్‌గానే ఉమా ఉన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో తనపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్‌పైనా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానూ పలుమార్లు విమర్శలు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా వసంత కృష్ణ ప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో గెల్చిన మైలవరం టికెట్‌ను పొందారు. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఆగ్రహానికి కారణమైంది. పార్టీలో సీనియర్‌ నేతగా, అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే తనకే టికెట్‌ కేటాయించకపోవడం పట్ల దేవినేని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకానొక దశలో పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ వెనక్కి తగ్గారు. కానీ, పార్టీ మార్పుపై ఆయన పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. అదే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చర్చలకు కారణమైనట్టు చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సూచనల మేరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమాను అత్యంత ర‌హ‌స్యంగా విజ‌య‌వాడ‌కు శివారులోని ఓ రిసార్టులో క‌లుసుకున్నార‌ని తెలిసింది.

ఈ క్ర‌మంలో వారు రెండు ఆఫ‌ర్లు ఇచ్చార‌ని చెబుతున్నారు. ప్ర‌చార ఖ‌ర్చులు భ‌రించ‌డంతోపాటు.. పార్టీ మైల‌వ‌రం టికెట్‌ను కూడా ఆయ‌న‌కు ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తెచ్చార‌ని స‌మాచారం. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక సీనియర్‌ నేతకు దేవినేని సన్నిహితంగా ఉంటారు. సదరు నేత ద్వారానే కాంగ్రెస్‌ పార్టీ ఈ చర్చలను సాగిస్తున్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>