MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-latest-situation-in-pithapuram-where-pawan-is-standing1ad9b0ed-a489-4a61-8057-23928a189fc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-latest-situation-in-pithapuram-where-pawan-is-standing1ad9b0ed-a489-4a61-8057-23928a189fc6-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించాడు. ఇక పవన్ 2014 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జనసేన అనే పార్టీని స్థాపించినప్పటికీ అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రజల్లో కలిసిపోయి 2019 వ సంవత్సరం జనసేన పార్టీని ఎన్నికల్లో నిలిపాడు. అందులో భాగంగా 2019 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం , గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన రెండు స్థానాల్లో అభ్యర్థిగా తన పేరును pawan{#}naina;Gajuwaka;pithapuram;Janasena;Andhra Pradesh;TDP;Assembly;kalyan;Hanu Raghavapudiపవన్ : ఒకే స్థానం నుండి పోటీ చేయడానికి స్ట్రాటజీ అదేనా..?పవన్ : ఒకే స్థానం నుండి పోటీ చేయడానికి స్ట్రాటజీ అదేనా..?pawan{#}naina;Gajuwaka;pithapuram;Janasena;Andhra Pradesh;TDP;Assembly;kalyan;Hanu RaghavapudiTue, 26 Mar 2024 11:10:22 GMTపవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం రాజకీయాలపై మాత్రమే దృష్టి సారించాడు. ఇక పవన్ 2014 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జనసేన అనే పార్టీని స్థాపించినప్పటికీ అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రజల్లో కలిసిపోయి 2019 వ సంవత్సరం జనసేన పార్టీని ఎన్నికల్లో నిలిపాడు. అందులో భాగంగా 2019 వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం , గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈయన రెండు స్థానాల్లో అభ్యర్థిగా తన పేరును ప్రకటించుకున్న తర్వాత కచ్చితంగా ఒకదానిలో నైనా గెలుస్తారు అని అంతా అనుకున్నారు. కానీ రెండింటిలో ఓడిపోవడంతో పవన్ తో పాటు జన సైనికులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇక మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో జనసేన... టిడిపి , బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అందులో భాగంగా పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాలను పర్యటిస్తూ ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్న ఈయన మరికొన్ని రోజుల్లోనే పిఠాపురంలో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక పోయిన సారి రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒకే చోట పోటీ చేస్తూ ఉండడంతో పలువురు పలు వాదనలను వినిపిస్తున్నారు. ఇక పవన్ మాత్రం ఇలా పోటీ చేయడానికి ఒక ప్రత్యేక స్ట్రాటజీ ఉందని చేసినట్లు తెలుస్తోంది. పోయినసారి రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడం ద్వారా దేనిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల రెండింటిలో ఓడిపోయినట్లు అలా ఈ సారి కాకుండా కేవలం ఒకే అసెంబ్లీ స్థానంపై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి జనాల అభిమానాన్ని భారీగా సంపాదించుకొని దాదాపు లక్ష మెజారిటీని ఆ ప్రాంతంలో సాధించే విధంగా పవన్ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>