PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan-yatra6a46038c-b948-4e91-9bee-dd9bc9efa68f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan-yatra6a46038c-b948-4e91-9bee-dd9bc9efa68f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయం కూడా దాదాపుగా పూర్తి చేసినటువంటి ప్రధాన పార్టీలు ఇక మీదట ప్రచారం పైన చాలా ఫోకస్ పెట్టబోతున్నాయి.. ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ టిడిపి నేత చంద్రబాబు ప్రచారంలో చాలా స్పీడ్ గా ఉన్నారు.. షెడ్యూల్ విడుదల తర్వాత ఇద్దరు ముఖ్య నేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.దీంతో అటు ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతున్నాయి. ఇప్పటికే సిద్ధం సభల పేరుతCHANDRABABU.JAGAN YATRA{#}CBN;Nellore;Kurnool;Uttarandhra;Rayalaseema;Srikalahasti;Markapauram;Kadiri;Yatra;Nagari;Mydukur;Nandyala;Nandikotkur;politics;bus;TDP;March;CM;Andhra Pradeshఓకే రోజు తలబడనున్న సీఎం జగన్.. చంద్రబాబు..!!ఓకే రోజు తలబడనున్న సీఎం జగన్.. చంద్రబాబు..!!CHANDRABABU.JAGAN YATRA{#}CBN;Nellore;Kurnool;Uttarandhra;Rayalaseema;Srikalahasti;Markapauram;Kadiri;Yatra;Nagari;Mydukur;Nandyala;Nandikotkur;politics;bus;TDP;March;CM;Andhra PradeshMon, 25 Mar 2024 10:00:00 GMTఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒకసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయం కూడా దాదాపుగా పూర్తి చేసినటువంటి ప్రధాన పార్టీలు ఇక మీదట ప్రచారం పైన చాలా ఫోకస్ పెట్టబోతున్నాయి.. ఇలాంటి సమయంలోనే సీఎం జగన్ టిడిపి నేత చంద్రబాబు ప్రచారంలో చాలా స్పీడ్ గా ఉన్నారు.. షెడ్యూల్ విడుదల తర్వాత ఇద్దరు ముఖ్య నేతలు ఒకే రోజు ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.దీంతో అటు ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు చాలా రసవత్తంగా మారుతున్నాయి.


ఇప్పటికే సిద్ధం సభల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిన సీఎం జగన్ ఈసారి మేమంతా సిద్ధమని ఒక బస్సు యాత్రను కూడా మొదలు పెట్టబోతున్నారు.. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభం చేసి ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. ఈ నేల 27న వైయస్సార్ షూట్ వద్ద నివాళులు అర్పించి ఈ బస్సు యాత్రను మొదలు పెట్టబోతున్నారు. అలా ఆరోజు సాయంత్రమే పొద్దుటూరులో నిర్వహించాలన్న ఒక సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 28న నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో మమేకం కాబోతున్నారు. 29న కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్రగా వెళ్లబోతున్నారు..


ఇలా ఈనెల 27 నుంచి చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. అలా 31 వరకు పలు రకాల పర్యటనలను చేయబోతున్నారు. రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో సభలు రోడ్డు షోలు సాగేలా ప్లాన్ చేస్తున్నారట. 27న నెల్లూరు రూరల్ నగరి పలమనేరులో ప్రచారం చేయగా.. 28న సింగనమల, కదిరి ,రాప్తాడును చేయగా.. 29న కర్నూల్ నందికొట్కూరు శ్రీశైలం.. 30వ తేదీన శ్రీకాళహస్తి ప్రొద్దుటూరు మైదుకూరు తదితర ప్రాంతాలలో.. 31న మార్కాపురం ,కావాలి, ఒంగోలు పర్యటించిన అన్నారు.. ఇక 25, 26 కుప్పంలోని చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇలా సీఎం జగన్ చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. అయితే మార్చి 29న మాత్రం కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించబోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>