MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star76abf893-bbc4-451f-b7f6-c81141623d68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/family-star76abf893-bbc4-451f-b7f6-c81141623d68-415x250-IndiaHerald.jpgవరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. గీతా గోవిందం సినిమాతో విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు, ప్రమోషన్లు కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన నంద నందనా, కళ్యాణి వచ్చా పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయFamily Star{#}Shreya Ghoshal;gautham new;gautham;kalyani;sree mani;Geetha Govindam;Joseph Vijay;Blockbuster hit;parasuram;king;Audience;March;vijay deverakonda;festival;producer;Producer;Heroine;Director;Cinemaఫ్యామిలీ ఆడియన్స్ పై ఫ్యామిలీ స్టార్ ఫోకస్?ఫ్యామిలీ ఆడియన్స్ పై ఫ్యామిలీ స్టార్ ఫోకస్?Family Star{#}Shreya Ghoshal;gautham new;gautham;kalyani;sree mani;Geetha Govindam;Joseph Vijay;Blockbuster hit;parasuram;king;Audience;March;vijay deverakonda;festival;producer;Producer;Heroine;Director;CinemaMon, 25 Mar 2024 18:11:24 GMTవరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. గీతా గోవిందం సినిమాతో విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు, ప్రమోషన్లు కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన నంద నందనా, కళ్యాణి వచ్చా పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. మ్యూజిక్ లవర్స్ ను కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి.హోలీ పండుగ సందర్భంగా మేకర్స్.. ఈ మూవీ నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు. మధురము కదా మెలోడియస్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్.. హీరోపై ఉన్న ఫీలింగ్స్ ను ఎంతో అద్భుతంగా వర్ణిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ క్లాసికల్ టచ్ తో మధురమైన ట్యూన్ ని అందించారు.ఈ పాటకి శ్రీ మణి సాహిత్యం అదిరిపోగా.. తన వాయిస్ తో శ్రేయా ఘోషల్ ప్రాణం పోసింది.


ఇక నందనందనా సాంగ్ లో విజయ్ దేవరకొండ హైదరాబాద్ వీధుల్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించగా.. ఈ సాంగ్ లో విదేశాల్లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ వేస్తోంది. విజయ్, మృణాల్ ఇద్దరూ హోమ్లీగా, చాలా అందంగా కనిపిస్తున్నారు. విజువల్స్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయాయి. ఫుల్ సాంగ్ స్క్రీన్ పై చాలా అద్భుతంగా ఉండనుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ పాట మెలోడియస్ గా బాగుందని చెబుతున్నారు.ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించనున్నారు విజయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమో, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్ కూడా ఉన్నట్లు పూర్తిగా అర్ధమవుతోంది. మార్చి 28వ తేదీన ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ కంటిన్యూ చేయనున్న విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ మూవీతో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ గా బాగా దగ్గరవ్వాలని చూస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఒక్కసారి ఏ మూవీ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు వస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>