Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9dea21c-da34-44a0-8b1f-43992e0a25e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea9dea21c-da34-44a0-8b1f-43992e0a25e9-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలుగులో అగ్ర కథానాయకులుగా ఉన్నవారంతా పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాత్రం స్థానికంగానే చేస్తున్నప్పటికీ ఫ్యాన్ బేస్ కానీ, పారితోషికంకానీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటాయి. రేపో ఎల్లుండో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నారు. ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్లు మారాయని వార్తలు వస్తున్నాయి. ఎవరెంత తీసుకుంటున్నారో ఒకసారి తెలుసsocialstars lifestyle{#}mahesh babu;RRR Movie;Darling;Prabhas;CBN;Jr NTR;Venkatesh;News;India;Ram Charan Teja;Hero;Film Industry;Pawan Kalyan;Allu Arjunమన టాలీవుడ్ హీరోల కొత్త రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...??మన టాలీవుడ్ హీరోల కొత్త రెమ్యునరేషన్ ఎంతో తెలుసా...??socialstars lifestyle{#}mahesh babu;RRR Movie;Darling;Prabhas;CBN;Jr NTR;Venkatesh;News;India;Ram Charan Teja;Hero;Film Industry;Pawan Kalyan;Allu ArjunMon, 25 Mar 2024 13:40:00 GMTతెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెలుగులో అగ్ర కథానాయకులుగా ఉన్నవారంతా పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మాత్రం స్థానికంగానే చేస్తున్నప్పటికీ ఫ్యాన్ బేస్ కానీ, పారితోషికంకానీ పాన్ ఇండియా స్థాయిలోనే ఉంటాయి. రేపో ఎల్లుండో మహేష్ బాబు కూడా పాన్ వరల్డ్ హీరో అయిపోతున్నారు. ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్లు మారాయని వార్తలు వస్తున్నాయి. ఎవరెంత తీసుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు. డార్లింగ్ ధాటికి ఖాన్ త్రయం వెనకబడిపోయింది. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తను ఒక్కో సినిమాకు రూ.120 నుంచి రూ.150 కోట్ల పారితోషికంతోపాటు లాభాల్లో వాటా తీసుకుంటాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ హీరో అయ్యారు. తన సినిమాలపై అంచనాలు భారీగా ఉంటున్నాయి.
మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ పారితోషికం అదే రేంజ్ లో ఉంటుంది. సినిమాకు రూ.80 నుంచి రూ.120 కోట్ల మధ్య తీసుకుంటారని తెలుస్తోంది. లాభాల్లో వాటాలు తీసుకోవడంలాంటివి చేయరు. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తను కూడా సినిమాకు రూ.80 నుంచి రూ.120 కోట్ల మధ్య తీసుకుంటాడంటారు. రామ్ చరణ్ కూడా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాకు రూ.100 నుంచి రూ.120 కోట్లు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ పారితోషికం కూడా రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు ఉంది. దాదాపు ఈ హీరోలంతా తమ పారితోషికాన్ని రూ.100 కోట్లకు తక్కువగా మాత్రం తీసుకోవడంలేదని అర్థమవుతోంది. భవిష్యత్తులో ఎవరెంత ఛార్జి చేస్తారో చూడాలి మరి.
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కథను బలంగా చేసుకొని, దర్శకత్వ నైపుణ్యంతో అత్యంత ప్రతిభావంతమైన సినిమాలను తెరకెక్కిస్తోంది. అలాగే పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో కొంతమంది ఏకంగా పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. అయితే వీరి తర్వాత తరంలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>