Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb293a67b-c489-4ebf-bf13-c4866c981162-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb293a67b-c489-4ebf-bf13-c4866c981162-415x250-IndiaHerald.jpgహీరో నిఖిల్ సిద్దార్థ కెరీర్ మార్చేసిన సినిమా 'స్వామిరారా'. అప్పటివరకు కుర్రాడిగా మాస్, కమర్షియల్ సినిమాలంటూ ఏవి పడితే అవి చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు.వరుస ఫ్లాప్స్ లో ఉన్న నిఖిల్ కి స్వామిరారా సినిమా బ్రేక్ వేసి హిట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచే నిఖిల్ సినిమాల ఎంపికలో తన స్టైల్ మార్చి కొత్త కథలతో రావడం మొదలుపెట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, స్వాతి హీరోయిన్స్ గా సత్య, రవిబాబు, పూజా రామచంద్రన్, జీవా.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.స్వామిరారా కsocialstars lifestyle{#}Swati;siddhartha;sudheer varma;swathi;Hero Heroine;Tom Banton;Tom Hooper;Pooja Hegde;Kerala;Heroine;Ram Gopal Varma;March;Success;Director;Hero;Cinema'స్వామిరారా' సినిమా సీక్వెల్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన హీరో నిఖిల్...!!!'స్వామిరారా' సినిమా సీక్వెల్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన హీరో నిఖిల్...!!!socialstars lifestyle{#}Swati;siddhartha;sudheer varma;swathi;Hero Heroine;Tom Banton;Tom Hooper;Pooja Hegde;Kerala;Heroine;Ram Gopal Varma;March;Success;Director;Hero;CinemaSun, 24 Mar 2024 16:30:00 GMTహీరో నిఖిల్ సిద్దార్థ కెరీర్ మార్చేసిన సినిమా 'స్వామిరారా'. అప్పటివరకు కుర్రాడిగా మాస్, కమర్షియల్ సినిమాలంటూ ఏవి పడితే అవి చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు.వరుస ఫ్లాప్స్ లో ఉన్న నిఖిల్ కి స్వామిరారా సినిమా బ్రేక్ వేసి హిట్ ఇచ్చింది. ఈ సినిమా నుంచే నిఖిల్ సినిమాల ఎంపికలో తన స్టైల్ మార్చి కొత్త కథలతో రావడం మొదలుపెట్టాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, స్వాతి హీరోయిన్స్ గా సత్య, రవిబాబు, పూజా రామచంద్రన్, జీవా.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.స్వామిరారా కథేంటంటే.. దొంగతనాలు చేసుకునే ఓ బ్యాచ్ లోని హీరో హీరోయిన్ తో ప్రేమలో పడటం, అదే సమయంలో కేరళ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ఓ విలువ గల విగ్రహం మాయమవ్వడం, అది అటు ఇటు చేతులు మారి అనుకోకుండా ఈ దొంగల దగ్గరికి రావడం, దాని కోసం రౌడీలు వీళ్ళని వెంబడించడం అంటూ టామ్ అండ్ జెర్రీ కథలా సాగుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 3 కోట్లు పెట్టి తీయగా దాదాపు 10 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది స్వామిరారా సినిమా.ఈ సినిమా 2013 మర్చి 23 రిలీజ్ అయింది. సినిమా రిలీజయి 11 ఏళ్ళు అవడంతో హీరో నిఖిల్ నిన్న రాత్రి స్వామిరారా సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ స్వామిరారా 2 తీద్దామా? దీనికి సీక్వెల్ చేయొచ్చు.. మీరేమంటారు అని డైరెక్టర్ సుధీర్ వర్మ, హీరోయిన్ స్వాతిలను ట్యాగ్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా? ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసి హిట్ కొడతాడా చూడాలి. ఇటీవల నిఖిల్ కార్తికేయకి ఆల్రెడీ సీక్వెల్ తీసి హిట్ కొట్టి ఇంకో సీక్వెల్ కూడా ప్రకటించాడు. అందుకే హిట్ ఫామ్ ని కంటిన్యూ చేయడానికి స్వామిరారా సీక్వెల్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>