Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc99a22ef-3506-445a-b5de-a3223028a1a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc99a22ef-3506-445a-b5de-a3223028a1a7-415x250-IndiaHerald.jpgమలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ ఇక ఎంతలా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేయకుండా మిగతా హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించేందుకు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని చెప్పాలి. దీంతో ఇప్పటివరకు ఎన్నో పవర్ఫుల్ రోల్స్ లో నటించి తన నటనతో ఆకట్టుకుని ప్రేక్షకుల మధిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ హీరో. అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీలో ఏకంగా ప్రభాస్ స్నేహితుడి పాత్ర అయినా వరదరాజమన్నార్ రోల్లో నటించి ఆకట్టుకున్నTollywood{#}Saira Narasimhareddy;God Father;Chiranjeevi;Prabhas;Hero;Cinema;Telugu;Eventమెగాస్టార్ రెండుసార్లు అడిగినా.. ఆఫర్లు రిజర్వ్ చేశా : పృధ్విరాజ్మెగాస్టార్ రెండుసార్లు అడిగినా.. ఆఫర్లు రిజర్వ్ చేశా : పృధ్విరాజ్Tollywood{#}Saira Narasimhareddy;God Father;Chiranjeevi;Prabhas;Hero;Cinema;Telugu;EventSun, 24 Mar 2024 08:20:10 GMTమలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ ఇక ఎంతలా గుర్తింపును సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేయకుండా మిగతా హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించేందుకు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని చెప్పాలి. దీంతో ఇప్పటివరకు ఎన్నో పవర్ఫుల్ రోల్స్ లో నటించి తన నటనతో ఆకట్టుకుని ప్రేక్షకుల మధిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ హీరో. అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీలో ఏకంగా ప్రభాస్ స్నేహితుడి పాత్ర అయినా వరదరాజమన్నార్ రోల్లో నటించి ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ పాత్రతో ప్రభాస్ అభిమానులు అందరి హృదయాలలో పృథ్వీరాజ్ సుకుమారాన్ కి ప్రత్యేకమైన స్థానం దక్కింది. కాగా ఇక మరికొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నాడు ఈ హీరో. కాక ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఆడు జీవితం అనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ జరగగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.


 మెగాస్టార్ చిరంజీవి ప్రథమ పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాలని అప్పట్లో చిరంజీవి గారు కోరారు. ఇక ఆయన హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ ఈ రెండు సార్లు కూడా తాను ఆడు జీవితం అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో చేయలేనని.. మెగాస్టార్ కు చెప్పి క్షమాపణలు చెప్పాను అంటూ ఇటీవల కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు పృధ్విరాజ్ సుకుమారన్. కాగా ఆడు జీవితం సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలోని పాత్ర కోసం 31 కిలోలు తగ్గాడు ఈ హీరో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>