Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb226d87f-ab88-4d54-8f43-2e33e69f406d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb226d87f-ab88-4d54-8f43-2e33e69f406d-415x250-IndiaHerald.jpgఅచ్చ తెలుగు సోయగం.. చాందిని చౌదరి! తీర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ భామ.. లఘుచిత్రాలతో కెరీర్‌ మొదలుపెట్టింది. 'కేటుగాడు'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి..'మను'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. 'కలర్‌ ఫొటో'తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నది. తాజాగా.. విశ్వక్‌సేన్‌తో కలిసి 'గామి' చిత్రంలో పెద్దపెద్ద సాహసాలే చేసింది. అందం.. అభినయంతో టాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయితో మాటా ముచ్చట.నా అభిమాన దర్శకుడు మణిరత్నం. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో నటించాలన్నది నా కల. అన్ని జానర్స్‌ సినిమాsocialstars lifestyle{#}Industries;Darsakudu;producer;Producer;Director;Telugu;Cinemaవైరల్ అవుతున్న "గామి" హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు...!!!వైరల్ అవుతున్న "గామి" హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు...!!!socialstars lifestyle{#}Industries;Darsakudu;producer;Producer;Director;Telugu;CinemaSun, 24 Mar 2024 18:00:00 GMTఅచ్చ తెలుగు సోయగం.. చాందిని చౌదరి! తీర నగరం విశాఖలో పుట్టిపెరిగిన ఈ భామ.. లఘుచిత్రాలతో కెరీర్‌ మొదలుపెట్టింది. 'కేటుగాడు'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి..'మను'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. 'కలర్‌ ఫొటో'తో యూత్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నది. తాజాగా.. విశ్వక్‌సేన్‌తో కలిసి 'గామి' చిత్రంలో పెద్దపెద్ద సాహసాలే చేసింది. అందం.. అభినయంతో టాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయితో మాటా ముచ్చట.నా అభిమాన దర్శకుడు మణిరత్నం. ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో నటించాలన్నది నా కల. అన్ని జానర్స్‌ సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం.నేను చిన్నప్పుడు త్రోబాల్‌ బాగా ఆడేదాన్ని. అందులో చాంపియన్‌ను కూడా! కథలు కూడా బాగా రాసేదాన్ని. పెద్దయ్యాక రైటర్‌గా స్థిరపడాలని అనేకునేదాన్ని. ఇండస్ట్రీలో నటన తర్వాత.. దర్శకత్వం చేయాలన్నది నా డ్రీమ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏదైనా.. మంచి పాత్ర ఉంటే తప్పకుండా చేస్తాను. ఈ పాత్రే చేయాలన్న నిబంధన ఏదీ పెట్టుకోలేదు. కానీ, నాకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం.. ఎంత డబ్బు ఇచ్చినా చేయను.సమయం ఎంతో విలువైనది. సినిమా పరిశ్రమలో దాని విలువ మరింత ఎక్కువ. అయితే, ఒక నిర్మాత వల్ల రెండేళ్ల సమయం వృథా చేసుకోవాల్సి వచ్చింది. లేకుంటే.. ఈపాటికి ఇంకా మంచిస్థాయిలో ఉండేదాన్ని.

కొన్ని కథలు విన్నప్పుడు.. నన్ను నేను నియంత్రించుకోలేను. 'గామి' అలాంటిదే! ఈ కథ విన్నప్పుడే.. ఈ చిత్రంలో తప్పకుండా భాగం కావాలని ఫిక్సయ్యాను. మామూలుగా అయితే.. ఒక కథకు ఓకే చెప్పడానికి నేను కొంచెం టైమ్‌ తీసుకుంటాను. 'గామి'కి మాత్రం వెంటనే ఓకే చెప్పేశాను. నా మనసుకు చాలా తృప్తినిచ్చిన సినిమా ఇది.'గామి' ప్రయాణమంతా ఓ సాహస యాత్రలా సాగింది. హిమాలయాల్లో మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం. అక్కడ ఆక్సిజన్‌ చాలా తక్కువ ఉంటుంది. విశ్వక్‌, నేను ఆక్సిజన్‌ ట్యాంక్స్‌ పట్టుకుని వెళ్లి.. నటించాల్సి వచ్చేది. కొన్ని సీన్స్‌లో రోప్స్‌ సహాయంతో వేలాడటం.. కొండల మీదినుంచి దూకడంలాంటి సాహసాలు కూడా చేయాల్సి వచ్చింది.ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తాం. అందుకోసం ఎంతో కష్టపడతాం. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. వాటితో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. పనిలో సాగిపోవాలన్నదే నా సిద్ధాంతం.పరిశ్రమకు వచ్చి అప్పుడే పదేళ్లు పూర్తయ్యాయంటే.. నమ్మలేకుండా ఉన్నా! కొత్తలో ఎవరితో.. ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలిసేది కాదు. కానీ, ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అయితే, ఈ ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోయేది కాదు. పరిశ్రమ నన్ను గుర్తుంచుకునేలా.. ఏదో ఒకటి చేయాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>