PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-2024e1dc6899-fe6e-44e3-b698-efd894e761b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-2024e1dc6899-fe6e-44e3-b698-efd894e761b3-415x250-IndiaHerald.jpgఒక పంచాయతీ పరిధిలో కనుక ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్‌జెండర్లు ఉంటే వారిని శ్రమశక్తి సంఘంగా గుర్తించాలి.ఇక పని చేసే ప్రదేశాల్లో వారిని తక్కువ చేసి మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడాన్ని ఖచ్చితంగా నేరంగా పరిగణించాలి.ఇక ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి మండల ఇంకా జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని.. వారి ద్వారా పని ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్‌లో తెలిపింది.AP Elections 2024{#}Jagan;Andhra Pradesh;Panchayati;job;Cheque;central government;District;Government;Marchఏపీ: ట్రాన్స్‌జెండర్లకు జగనన్న శుభవార్త?ఏపీ: ట్రాన్స్‌జెండర్లకు జగనన్న శుభవార్త?AP Elections 2024{#}Jagan;Andhra Pradesh;Panchayati;job;Cheque;central government;District;Government;MarchSat, 23 Mar 2024 18:49:21 GMTజగన్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త చెప్పింది. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవనం గడిపే దిశగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వం చొరవ మేరకు ఉపాధి హామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం.దీంతో వారికి జాబ్ కార్డులను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మార్చి 15 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలని జారీ చేసింది.ఉపాధి హామి పనులు చేసేందుకు వచ్చే ఒక్కో ట్రాన్స్‌జెండర్‌ను ఒక్కో వ్యక్తిని ఒక్కో ఫ్యామిలీగా గుర్తించి జాబ్ కార్డులని ఇవ్వనున్నారు. ఇంకా అలాగే ఒకే పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్ జెండర్లు… పనుల కోసం ముందుకొస్తే వారిని శ్రమశక్తి సంఘాలుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు.సమాజంలో తమపై వివిక్ష ఇంకా కొనసాగుతోందని, పని దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని.. తమకు ప్రభుత్వమే ఆసరాగా ఉండాలంటూ గత కొంతకాలం నుంచి ట్రాన్స్‌జెండర్లు కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు.


దీంతో కేంద్ర సామాజిక న్యాయ ఇంకా సాధికారిక మంత్రిత్వశాఖ..ఈ ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధిహామీ పథకాన్ని వర్తింప చేయాలని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి.. ట్రాన్స్‌జెండర్లకు జాబ్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఇక ప్రభుత్వం పంపిన సర్క్యులర్ వివరాలు ఇలా ఉన్నాయి.ట్రాన్స్‌జెండర్‌ను కుటుంబంగా పరిగణించి జాబ్ కార్డుని అందజేయాలి.అప్లికేషన్ ఫామ్‌లో కూడా పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్‌జెండర్ కాలమ్ ఉంచాలి.ఒక పంచాయతీ పరిధిలో కనుక ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్‌జెండర్లు ఉంటే వారిని శ్రమశక్తి సంఘంగా గుర్తించాలి.ఇక పని చేసే ప్రదేశాల్లో వారిని తక్కువ చేసి మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడాన్ని ఖచ్చితంగా నేరంగా పరిగణించాలి.ఇక ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి మండల ఇంకా జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని.. వారి ద్వారా పని ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఎదురయ్యే సమస్యలకు చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్‌లో తెలిపింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>