LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsb086105f-f0ac-463d-9e78-fbeb01815127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tipsb086105f-f0ac-463d-9e78-fbeb01815127-415x250-IndiaHerald.jpgవేసవి కాలంలో తరచూగా బెల్లం కలిపిన నీటిని తాగటం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.ఇందుకోసం ఒక పెద్ద గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేసి దానిని కాస్త వేడిచేయాలి. బెల్లం కరిగిన తర్వాత, నీటిని వడకట్టాలి. నీరు చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. ఎండలో అలసిపోయినప్పుడు ఈ నీళ్లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి సమకూరుతుంది.. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.బెల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉండటం వల్ల రకHealth Tips{#}Iron;Copper;Jaggery;Magnesium;Sodium;Shakti;Aqua;Potassiumనీటిలో ఇది కలిపి తాగితే ఏ సమస్య రాదు?నీటిలో ఇది కలిపి తాగితే ఏ సమస్య రాదు?Health Tips{#}Iron;Copper;Jaggery;Magnesium;Sodium;Shakti;Aqua;PotassiumFri, 22 Mar 2024 19:39:09 GMTవేసవి కాలంలో తరచూగా బెల్లం కలిపిన నీటిని తాగటం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది.ఇందుకోసం ఒక పెద్ద గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేసి దానిని కాస్త వేడిచేయాలి. బెల్లం కరిగిన తర్వాత, నీటిని వడకట్టాలి. నీరు చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం కలుపుకుని తాగొచ్చు. ఎండలో అలసిపోయినప్పుడు ఈ నీళ్లను ఇంట్లోనే తయారు చేసుకుని తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి సమకూరుతుంది.. బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.బెల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లలో పొటాషియం, సోడియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో బెల్లం చేర్చుకోవచ్చు. ఇందులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. అంతేకాదు, వేసవిలో శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల కొంతమందికి మలబద్ధకం సమస్యగా మారుతుంది. బెల్లం మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి ప్రతి రోజూ కాస్త బెల్లం తినటం మంచిది. ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉండే బెల్లం తినడం వల్ల ఐరన్ లోపాన్ని సరిచేసి రక్తహీనతను నివారించవచ్చు. బెల్లం తినడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది అన్నవాహిక, ఊపిరితిత్తులు, పేగులను శుభ్రపరచడానికి పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెల్లంను ఆహారంలో చేర్చుకోవడం కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.బెల్లం నీళ్లు శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం, శరీరాన్ని చల్లబరచడం, డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. బెల్లం ఒక అద్భుతమైన సహజ స్వీటెనర్. దీనిని చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. బెల్లం తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండేందుకు, వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరిచేందుకు మంచిదని వైద్యులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>