MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgడిఫరెంట్ సినిమాలకు చిరునామాగా శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ఇతడి సినిమాలలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ధియేటర్లు అన్నీ కలక్షన్స్ లేక సతమతమైపోతున్నాయి. వరసపెట్టి విడుదల అవుతున్న చిన్న సినిమాలలో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఏ ఒక్క చిన్న సినిమా కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోలేక పోతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం విడుదలవుతున్న ‘ఓం భీమ్ బుష్’ మూవీ పై శ్రీవిష్ణు చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక సారికొత్త కథతో ఈ మూవీsrivishnu{#}priyadarshi;ramakrishna;Komaram Bheem;Sree Harsha Konuganti;Hushaaru;SreeVishnu;Comedy;Makar Sakranti;Industry;Cinema;Yevaru;Heroభీమ్ బలం చూపెట్టగలదా !భీమ్ బలం చూపెట్టగలదా !srivishnu{#}priyadarshi;ramakrishna;Komaram Bheem;Sree Harsha Konuganti;Hushaaru;SreeVishnu;Comedy;Makar Sakranti;Industry;Cinema;Yevaru;HeroFri, 22 Mar 2024 08:08:08 GMTడిఫరెంట్ సినిమాలకు చిరునామాగా శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ఇతడి సినిమాలలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా ధియేటర్లు అన్నీ కలక్షన్స్ లేక సతమతమైపోతున్నాయి. వరసపెట్టి విడుదల అవుతున్న చిన్న సినిమాలలో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఏ ఒక్క చిన్న సినిమా కలక్షన్స్ పరంగా నిలదొక్కుకోలేక పోతోంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈవారం విడుదలవుతున్న ‘ఓం భీమ్ బుష్’ మూవీ పై శ్రీవిష్ణు చాల ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక సారికొత్త కథతో ఈ మూవీ ఉంటుంది అంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచడానికి శ్రీవిష్ణు చాల గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసినిమా ధియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకుడు లాజిక్ వదిలేసి ఈ మూవీని చూస్తే సినిమా మొత్తం హాయిగా నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటున్నాడు.


చాలామంది హీరోల సినిమాలు లా తన సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ రానప్పటికీ ఒక్కసారి తన మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలక్షన్స్ విషయంలో తనకు ఎదురు ఉండదు అని ఈ యంగ్ హీరో అంటున్నాడు. అదే నమ్మకంతో గతంలో శ్రీవిష్ణు ‘సామాజ వరగమన’ లో నటించి హిట్ కొట్టిన సందర్భం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ తనకు రిపీట్ అవుతుందని శ్రీవిష్ణు భావిస్తున్నాడు.  


ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. సంక్రాంతి తరువాత ఏసినిమాకు సరైన కలక్షన్స్ రాలేదు. ‘గామి’ ‘ఊరిపేరు భైరవకోన’ ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమాలాకు పాజిటివ్ టాక్ వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబడలేదు.  దీనితో ‘ఓం భీమ్ బుష్’ ఆలోటును తీరుస్తుందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు కడుతున్నారు. హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ లో శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించిన విషయం అందరికీ తెలిసిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>