PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-pithapuram32dcc783-1fe0-40af-9cf3-c44662a0687e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-pithapuram32dcc783-1fe0-40af-9cf3-c44662a0687e-415x250-IndiaHerald.jpgవిభజనపై లోపాయికారీగా చంద్రబాబు మద్దతు పలికి బయటకు మాత్రం తనకు రెండు ప్రాంతాలు చాలా ముఖ్యమనే కతలు చెప్పారు. చంద్రబాబు ఆప్పట్లోచేసిన పనివల్ల ఏపీ నాశనమైపోయింది. విభజనకు మద్దతు ఇవ్వద్దని అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎంతమొత్తుకున్నా వినలేదు. పైకి ఒకటి చెప్పి లోలోపల మాత్రం తాను అనుకున్నట్లే చేశారు. దాని ఫలితాన్ని ఏపీ ఇపుడు అనుభవిస్తోంది. అంటే చంద్రబాబు పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరోటి అన్న విషయం అర్ధమైపోయింది.pawan pithapuram{#}pithapuram;Hanu Raghavapudi;Andhra Pradesh;Jagan;Reddy;CBN;Pawan Kalyan;Congressగోదావరి : పవన్ అప్పుడే మొదలుపెట్టేశారా ?గోదావరి : పవన్ అప్పుడే మొదలుపెట్టేశారా ?pawan pithapuram{#}pithapuram;Hanu Raghavapudi;Andhra Pradesh;Jagan;Reddy;CBN;Pawan Kalyan;CongressThu, 21 Mar 2024 09:00:00 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఇంకా ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయకుండానే ఓటమికి సాకులు వెతుక్కుంటున్నట్లున్నారు. ఎలాగంటే పిఠాపురం నేతలతో మాట్లాడుతు తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు  ఖర్చు పెడుతున్నట్లు ఆరోపించారు. ప్రత్యర్ధి అయిన పవన్ను ఓడించకుండా జగన్ గెలిపిస్తారా ? ఇంతమాత్రం ఇంగితం కూడా పవన్లో కనబడటంలేదు. ఒకవైపు వైసీపీని తరిమికొడతానని బహిరంగంగా చాలెంజులు చేస్తున్నారు, జగన్ను పాతాళానికి తొక్కేస్తానని శపధాలు చేస్తున్నారు. వైసీపీని ఓడించకపోతే తన పేరు పవన్ కల్యాణే కాదన్నారు. అదే ప్రయత్నం జగన్ చేస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.





నేతలతో మాట్లాడుతు పవన్  సిద్ధాంతాలు మొదలుపెట్టారు. భీమవరం, గాజువాక, పిఠాపురం తనకు మూడుకళ్ళని చెప్పారు. అప్పుడెప్పుడో చంద్రబాబునాయుడు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని వినిపించారు. మళ్ళీ ఇంతకాలానికి పవన్ అప్ డేటెడ్ వర్షన్ లాగ మూడుకళ్ళ సిద్ధాంతాన్ని వినిపించారు. రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతు తెలంగాణా, ఏపీ రెండు కళ్ళన్నారు.





విభజనపై లోపాయికారీగా చంద్రబాబు మద్దతు పలికి బయటకు మాత్రం తనకు రెండు ప్రాంతాలు చాలా ముఖ్యమనే కతలు చెప్పారు. చంద్రబాబు ఆప్పట్లోచేసిన పనివల్ల ఏపీ నాశనమైపోయింది. విభజనకు మద్దతు ఇవ్వద్దని అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎంతమొత్తుకున్నా వినలేదు. పైకి ఒకటి చెప్పి లోలోపల మాత్రం తాను అనుకున్నట్లే చేశారు. దాని ఫలితాన్ని ఏపీ ఇపుడు అనుభవిస్తోంది. అంటే చంద్రబాబు పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరోటి అన్న విషయం అర్ధమైపోయింది.




ఇంతకాలానికి పవన్ కూడా చంద్రబాబునే ఫాలోఅవుతున్నారు. మూడుకళ్ళ సిద్ధాంతం ఏమిటో పవన్ కే తెలియాలి. 2019 ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. అప్పటినుండి రెండు నియోజకవర్గాల్లోను పెద్దగా తిరిగిందిలేదు. ఎన్నికల సమయంలో పైరెండు నియోజకవర్గాల్లో ఇళ్ళు తీసుకుంటానని, రెగ్యులర్ గా పర్యటిస్తుంటానని హామీ ఇచ్చారు. ఓడిన తర్వాత పై నియోజకవర్గాల్లో పెద్దగా తిరిగిందేలేదు.


తిరక్కపోగా తనను ఓడించిన రెండు నియోజకవర్గాల జనాలను శాపనార్ధాలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.  రేపటి ఎన్నికల్లో పిఠాపురం రిజల్టు ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుని అన్నింటికన్నా పిఠాపురమైతే సేఫ్ అని అనుకుని పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ గెలుపు అంత వీజీయితే కాదు. అందుకనే ముందుగానే ఓటమికి సాకులు రెడీ చేసుకుంటున్నట్లు అనుమానంగా ఉంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>